అతన్ని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లే... టీ20 వరల్డ్ కప్‌లో ఆడిస్తారా?...

Published : Aug 04, 2022, 07:25 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో రవిచంద్రన్ అశ్విన్ పేరు చూసి అందరూ షాక్ అయ్యారు. వైట్ బాల్ క్రికెట్‌కి దూరమైన నాలుగేళ్లకు అనుకోకుండా మెగా టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు అశ్విన్. తొలి రెండు మ్యాచుల్లో ఆడని అశ్విన్, ఆ తర్వాత మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...

PREV
17
అతన్ని ఎందుకు సెలక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లే... టీ20 వరల్డ్ కప్‌లో ఆడిస్తారా?...
Sanju Samson-DK-Ashwin

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో కనిపించని రవిచంద్రన్ అశ్విన్, తిరిగి వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా మళ్లీ వైట్ బాల్ టీమ్‌లోకి వచ్చాడు...

27

సౌతాఫ్రికాతో, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లకు రవిచంద్రన్ అశ్విన్‌ని పక్కనబెట్టిన బీసీసీఐ సెలక్టర్లు, 8 నెలల గ్యాప్ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు తిరిగి పిలవడంతో అనుమానాలు రేగుతున్నాయి...
 

37

కుల్దీప్ యాదవ్ గాయాలతో బాధపడుతూ ఉండడం, యజ్వేంద్ర చాహాల్ రాణిస్తున్నా ఎక్కువగా పరుగులు ఇస్తుండడంతో రవిచంద్రన్ అశ్విన్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేయబోతున్నారా? అనేది అనుమానంగా మారింది...

47

‘అశ్విన్ విషయంలో నాకు క్లారిటీ రావడం లేదు. అతన్ని ఎందుకు పక్కనబెట్టారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడించలేదు. మళ్లీ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి ఎందుకు ఎంపిక చేశారు...

57

రవీంద్ర జడేజా ఎప్పుడూ టీమిండియాకి ప్రధాన స్పిన్నర్. ఆ తర్వాతి పొజిషన్‌ కోసం యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ పోటీపడుతున్నట్టు ఉంది... 

67

వీరిలో ఇద్దరికి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ ఉండొచ్చు. చాహాల్‌ని పక్కనబెట్టి అశ్విన్‌ని తీసుకుంటారా? అయితే అశ్విన్‌లో ఆల్‌రౌండ్ సత్తా ఉండడం వల్లే అతనికి అవకాశాలు ఇస్తున్నట్టున్నారు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...

77

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో 3 మ్యాచులు ఆడిన రవిచంద్రన్ అశ్విన్, 6.66 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు. రీఎంట్రీ తర్వాత ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసిన అశ్విన్, మూడో టీ20లో వికెట్ తీయలేకపోయాడు..

click me!

Recommended Stories