భారత జట్టు తరుపున ఎన్ని మ్యాచులు ఆడినా, భారీ హిట్టర్ యువరాజ్ సింగ్ టాలెంట్‌కి తగినన్ని అవకాశాలు మాత్రం రాలేదు. ఎమ్మెస్ ధోనీ కెరీర్ బ్యాటింగ్, యువీ కెరీర్ బ్యాటింగ్ రెండూ పక్కపక్కనబెట్టి చూస్తే... భారత జట్టుకి మాహీ సాధించిన విజయాల కంటే యువీ అందించిన విజయాలే ఎక్కువ.
2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ దాకా చేరడానికి, 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్‌లను ఓడించడానికి యువరాజ్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్‌లో ధోనీ కెప్టెన్సీ నీడలో కమ్ముకుపోయాయి.
దీపికా పదుకొనే ఎపిసోడ్ తర్వాత యువరాజ్ సింగ్‌కీ, మహేంద్ర సింగ్ ధోనీకి మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే యువీని జట్టుకు దూరం చేసేందుకు మాహీ పావులు కదిపాడని యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ చాలామంది ఆరోపిస్తుంటారు.
మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ ఇద్దరూ దీపికా పదుకొనేను ఇష్టపడ్డారు. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. అయితే యువీ కోసం దీపికాను త్యాగం చేశాడు మాహీ. అయితే చాలామంది హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువరాజ్ సింగ్, దీపికా పదుకొనేతో కూడా చాలారోజులు ఉండలేకపోయాడు.
వీరిద్దరికీ కొన్నిరోజుల్లోనే బ్రేకప్ జరిగిపోయింది. అయితే ఈ సంఘటన మాహీని చాలా బాధపెట్టిందని టాక్. 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్‌ను కాదని, ధోనీ బ్యాటింగ్ లైనప్‌లో ముందు రావడం ఇప్పటికీ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి ఫామ్‌లో ఉన్న యువీ, ఆ టోర్నీలో అప్పటికే 341 పరుగులు చేశాడు.
ధోనీ, వరల్డ్‌కప్ చేసిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 151 పరుగులే. అలాంటిది యువీని పక్కనబెట్టి ధోనీ బ్యాటింగ్‌కి రావడం చూసి క్రికెట్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. ధోనీ క్రీజులోకి వచ్చే సమయానికి భారత జట్టు విజయానికి 28.2 ఓవర్లలో 161 పరుగులు కావాలి.
అది ఏమంత కష్టసాధ్యమైన పని కాదు. అప్పటికే గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ భాగస్వామ్యం వల్ల భారత జట్టు పటిష్టమైన స్థితికి చేరుకుంది. యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి వెళ్లేందుకు ప్యాడ్స్ కట్టుకుని ఉండగా, అతన్ని వద్దని చెప్పి ధోనీ బ్యాటింగ్‌కి వెళ్లాడు.
ఫైనల్ మ్యాచ్‌లో 91 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, హెలికాఫ్టర్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించి వరల్డ్‌కప్ విజయంలో క్రెడిట్ మొత్తం కొట్టేశాడు.
‘ధోనీ కొట్టిన ఒక్క సిక్సర్ వల్ల వరల్డ్ కప్ రాదు. యువీ, నేను, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లం ఎంతో రాణించడం వల్ల వరల్డ్‌కప్ గెలవగలిగాం’ అంటూ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ చెప్పుకొస్తూ ఉంటాడు.
అయితే యువరాజ్ సింగ్ కంటే ధోనీ ముందు రావడం ఇదే తొలిసారి కాదు. 2007లో గౌహతిలో జరిగిన వన్డేలో కూడా మాహీ ఇలాగే చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరుసిక్సర్లు బాదిన యువీని పక్కనబెట్టి, ధోనీ బ్యాటింగ్‌కి వచ్చాడు.
అప్పటికే ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 192 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, ఓ మ్యాచ్‌లో 121 పరుగులతో అదరగొట్టాడు. అలాంటి బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యువీని కాదని, ధోనీ బ్యాటింగ్ లైనప్‌లో ప్రమోషన్ తీసుకున్నాడు.
ఆ మ్యాచ్‌లో 77 బంతుల్లో 63 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, విజయానికి 100 పరుగులు కావాల్సిన దశలో అవుట్ అయ్యాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 74 బంతుల్లో ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 58 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించాడు.
‘గంభీర్ క్రీజులో ఉన్నప్పుడు యువరాజ్ సింగ్ బ్యాటింగ్‌కి వెళితే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌కి బౌలింగ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం నేను బ్యాటింగ్‌లో ప్రమోషన్ తీసుకున్నా’ అని చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ.
అయితే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ కంటే ముందు బ్యాటింగ్‌కి వెళ్లాలంటూ మాహీకి సూచించాడట సచిన్ టెండూల్కర్. సచిన్ సలహాను తీసుకున్న ధోనీ, యువీ కంటే ముందు క్రీజులోకి వచ్చాడట.
అయితే ఆ తర్వాత కానీ, భారత జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడూ ఎప్పుడూ మహేంద్ర సింగ్ ధోనీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం... తనను తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో మరింత కిందకు దిగజార్చుకుంటూ పోవడాన్ని విమర్శిస్తూ ఉంటారు యువీ ఫ్యాన్స్...
పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా... సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలను 50 శాతం వినియోగించలేదని కామెంట్ చేశాడు కానీ అసలు యువరాజ్ సింగ్ లాంటి వజ్రాన్ని భారత జట్టు 10 శాతం కూడా సరిగ్గా వాడుకోలేకపోయిందనేది వాస్తవం.