సెహ్వాగ్, కుంబ్లే, ద్రావిడ్, సచిన్ వంటి లెజెండ్స్ అందరూ టెస్టులను గౌరవించారు, ఒక్క ఎమ్మెస్ ధోనీ తప్ప...

First Published May 30, 2021, 3:06 PM IST

భారత జట్టు ఇప్పుడు అత్యంత పటిష్టమైన జట్లలో ఒకటి. టీమిండియా రిజర్వు బెంచ్ బలాన్ని చూసి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్‌లు కూడా షాక్ అవుతున్నాయి. దీనికి కారణం భారత జట్టు టెస్టులకు ఇచ్చిన ప్రాధాన్యమే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్...

‘భారత జట్టు ఇప్పడున్న పొజిషన్‌కి వాళ్లు రెడ్ బాల్ క్రికెట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. భారత ఒకప్పుడు టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో ఒకే జట్టును ఆడించేది. ఇద్దరు, ముగ్గురు ప్లేయర్లు తప్ప, అందరూ వాళ్లే ఉండేవాళ్లు.
undefined
కానీ ఇప్పుడు భారత జట్టుకి దాదాపు 50 మంది ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. ఒకే సారి రెండు కాదు, మూడు జట్లు కావాలన్నా కూడా టీమిండియా తయారుచేసి పంపగలదు. దీనికి కారణంగా భారత లెజెండరీ క్రికెటర్లు టెస్టులకు ఇచ్చిన గౌరవం.
undefined
ఎమ్మెస్ ధోనీ తప్ప వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్ వంటి మిగిలిన లెజెండరీ ప్లేయర్లు... వన్డే, టీ20ల కంటే ఎక్కువగా టెస్టులు ఆడడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
undefined
చాలామంది క్రికెటర్లు మొదటి టీ20, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, చివరిగా టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇది భారత జట్టు భవిష్యత్ నిర్మాణానికి పునాదులు వేసింది.
undefined
సీనియర్లు టెస్టుల్లో కొనసాగుతూ ఉండడం వల్ల యువ ఆటగాళ్లకు వన్డే, టీ20ల్లో అవకాశాలు దక్కాయి. అక్కడ నిరూపించుకున్న తర్వాత సంప్రదాయ ఫార్మాట్‌లో కూడా వారికి చోటు దక్కింది...
undefined
వైట్ బాల్, లేదా లిస్టు ఏ క్రికెట్ ఆడే ప్లేయర్లు, అంతర్జాతీయ మ్యాచ్ ఆడే సమయానికి 40 నుంచి 50 మ్యాచులు ఆడి ఉంటారు. ఉదాహరణ సూర్యకుమార్ యాదవ్... అతను టీమిండియాలో చోటు కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడు.
undefined
అతనికి నాలుగైదు ఏళ్ల దేశవాళీ, ఐపీఎల్ అనుభవం ఉంది. ఈ అనుభవమై వాళ్లు టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి తోడ్పడింది.
undefined
భారత క్రికెట్ మైండ్ సెట్, ప్రపంచ క్రికెట్‌పై ఆధిక్యాన్ని చూపుతోంది. 90ల్లో భారత జట్టు తరుపున ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్లేయర్లు యువ ఆటగాళ్లను తయారుచేయడంలో భాగం అవుతున్నారు.
undefined
యువతరానికి సాయం చేస్తూ, స్టార్లుగా మలుస్తున్నారు. ఐపీఎల్ మాత్రమే కాదు, దేశవాళీ క్రికెట్‌లో కూడా యువరాజ్ సింగ్ , వీరేంద్ర సెహ్వాగ్ లాంటి సీనియర్ల సాయం మరువలేనిది...
undefined
టీమిండియా వారి బ్రాండ్‌ను మార్చుకోలేదు సరికదా దాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. దీని వెనక గంగూలీ నుంచి యువరాజ్ సింగ్ ప్రతీ ఒక్క సీనియర్ క్రికెటర్ ఉన్నారు...’ అంటూ చెప్పుకొచ్చాడు కమ్రాన్ అక్మల్.
undefined
పాకిస్తాన్ జట్టుకి వికెట్ కీపర్‌గా వ్యవహారించిన కమ్రాన్ అక్మల్, పాక్ తరుపున 53 టెస్టులు, 157 వన్డేలు, 58 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 11 సెంచరీలు చేసిన కమ్రాన్ అక్మల్, 6886 పరుగులు చేశాడు.
undefined
కెరీర్‌లో 90 టెస్టులు ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, 2014లోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌కి 2020లో వీడ్కోలు పలికాడు ధోనీ...
undefined
అనిల్ కుంబ్లేతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి ప్లేయర్లు మాత్రం వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో సుదీర్ఘ కెరీర్ కొనసాగించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
undefined
click me!