ధోనీ, ఆగస్టు 15న రిటైర్మెంట్ ఇవ్వడానికి అసలు కారణం ఇది... మాహీ సీక్రెట్ బయటపెట్టిన సాక్షి సింగ్..

First Published Aug 20, 2023, 7:41 PM IST

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020, ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి... అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ధోనీ, రిటైర్మెంట్ ఇవ్వడానికి ఆగస్టు 15ని ఎంచుకోవడానికి కారణం ఏంటి?

ఐపీఎల్ 2020 కోసం దుబాయ్ వెళ్లిన ధోనీ, ఆగస్టు 15న ఈరోజు 19:29 నిమిషం నుంచి నేను రిటైర్ అయినట్టుగా భావించండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పటిదాకా ఇన్‌స్టాలో అత్యధిక మంది చూసిన క్రికెట్ వీడియో ఇదే...

క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించడానికి ముందు టికెట్ కలెక్టర్‌గా పనిచేసిన ధోనీ, రిటైర్మెంట్ ఇవ్వడానికి తాను రాంఛీలో ఎక్కిన ట్రైన్ టైమింగ్ 19:29ని ఎంచుకున్నాడనేది చాలామందికి తెలుసు... 

Latest Videos


భారత జట్టు కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ... రిటైర్మెంట్ ఇవ్వడానికి భారత స్వాతంత్య్ర దినోత్సవం కంటే బెటర్ డేట్ ఇంకేదీ ఉండకవపోచ్చని అనుకుని ఉంటాడని చాలామంది అనుకున్నారు...
 

అయితే ఆ రోజున ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అతని వ్యక్తిగత జీవితంతోనూ సంబంధం ఉంది. ఎందుకంటే ఆగస్టు 15న మాహీ తల్లి దేవకీ దేవి పుట్టిన రోజు కూడా. పాన్ సింగ్ ధోనీ, దేవకీ దేవీలకు మూడో సంతానం ధోనీ. మాహీకి అన్న నరేంద్ర సింగ్ ధోనీ, అక్క జయంతీ గుప్తా ఉన్నారు..

‘పెళ్లికి ఒక్క రోజు ముందు మా అత్తగారిని కలిశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా మధ్య ఓ గొప్ప బంధం ఏర్పడింది. మేం అత్తా కోడళ్లలా కాకుండా స్నేహితుల్లా ఉంటాం. ప్రతీ విషయాన్ని పంచుకుంటాం. పెళ్లైన కొత్తలో ధోనీ, క్రికెట్ మ్యాచుల కోసం బయటికి వెళ్లేవాడు..

లేవగానే కొత్త మనుషుల మధ్య ఉన్నట్టుగా అనిపించేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మా అత్తయ్య, నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నాకు ఉన్న అతి పెద్ద సపోర్ట్ ఆమె. తను లేకుండా ఈ ఇంటిని ఊహించుకోలేను..’ అంటూ అత్త దేవకీ దేవికి బర్త్ డే విషెస్ తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది సాక్షి సింగ్..

ధోనీ తన తల్లి పుట్టిన రోజు కావడం వల్లే ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టు తేలిపోయింది. విరాట్ కోహ్లీ తండ్రి దివంగత ప్రేమ్ కోహ్లీ పుట్టినరోజు కూడా ఆగస్టు 15నే కావడం విశేషం...

రనౌట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ని ప్రారంభించిన మహేంద్ర సింగ్ ధోనీ, రనౌట్‌తోనే కెరీర్‌కి స్వస్తి పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మూడు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న ధోనీ... వచ్చే సీజన్‌లో ఆడతాడని కూడా సాక్షి సింగ్ ఖరారు చేసింది.. 

click me!