వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డేల నుంచి తప్పుకోవాలి! షోయబ్ అక్తర్ సలహా... గంగూలీ రియాక్షన్..

First Published Aug 20, 2023, 6:35 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆఖరిది. అలాగే రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీలకు కూడా ఇదే ఆఖరి వన్డే వరల్డ్ కప్ కావచ్చు. వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20ల నుంచి తప్పుకుని, టెస్టులకు మాత్రమే పరిమితం కావాలంటూ సలహా ఇచ్చాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..
 

‘వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ వన్డేల్లో ఎక్కువగా కనిపిస్తాడని నేను అనుకోవడం లేదు. అలాగే టీ20ల్లో కూడా. నా ఉద్దేశంలో విరాట్ కోహ్లీ మరో ఆరేళ్లు క్రికెట్ ఆడగలడు. అయితే అలా ఆడాలంటే వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుని టెస్టు క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టాలి...
 

సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయగల ఒకే ఒక్కడు విరాట్ కోహ్లీయే. అయితే అతను మూడు ఫార్మాట్లు ఆడుతూ పోతే, ఆ రికార్డును అందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే టీ20 ఫార్మాట్‌ కారణంగా చాలా చాలా శ్రమ వృథా అవుతుంది.. 

అందుకే విరాట్ కోహ్లీ సుదీర్ఘ కెరీర్ కొనసాగించాలని అనుకుంటే, వన్డేల నుంచి వీలైతే వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుని, టెస్టులకు మాత్రమే పరిమితం కావాలి..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్..

షోయబ్ అక్తర్ కామెంట్లపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘వన్డే వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్ తీసుకోవడం ఎందుకు? అతను ఆడాలనుకుంటే అన్ని ఫార్మాట్లు ఆడతాడు. ఫామ్‌లో ఉన్నాడు, అన్ని ఫార్మాట్లలో ఆడగల సామర్థ్యం అతనిలో ఉంది.. కాబట్టి అతన్ని తప్పుకోమనే హక్కు ఎవ్వరికీ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు సౌరవ్ గంగూలీ...
 

Image credit: PTI

వన్డేల్లో 46 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, మరో 4 సెంచరీలు చేస్తే 50 వన్డే సెంచరీలు అందుకున్న మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ వన్డేల్లో 49 సెంచరీలు అందుకున్నాడు. టీ20ల్లో 4 వేల పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు.. 

Image credit: PTI

షోయబ్ అక్తర్, విరాట్ కోహ్లీకి వీరాభిమానినంటూ చాలా సార్లు ప్రకటించుకున్నాడు. అక్తర్, కోహ్లీని ఒకే ఫార్మాట్‌కి పరిమితం కావాలని కామెంట్లు చేయడం పెద్దగా ఆశ్చర్యపరచలేదు కానీ సౌరవ్ గంగూలీ, విరాట్‌ని మూడు ఫార్మాట్లలో కొనసాగాలని కామెంట్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. 

click me!