హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై బీసీసీఐ అసంతృప్తి... రోహిత్ శర్మ తర్వాత జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ!

Published : Aug 20, 2023, 05:35 PM IST

2022 ఐపీఎల్‌కి ముందు హార్ధిక్ పాండ్యా, టీమిండియా కెప్టెన్ అవుతాడని ఎవ్వరూ అనుకోలేదు. అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా, టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత పాండ్యా కెప్టెన్సీలోనే టీ20 మ్యాచులు ఆడుతూ వస్తోంది భారత జట్టు..

PREV
16
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై బీసీసీఐ అసంతృప్తి... రోహిత్ శర్మ తర్వాత జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ!
Rahul Dravid-Hardik Pandya

రోహిత్ శర్మ, టెస్టులు, వన్డే ఫార్మాట్‌కి మాత్రమే పరిమితం కావడంతో టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా దాదాపు కన్ఫార్ట్ అయిపోయినట్టే అనిపించాడు. అయితే వెస్టిండీస్‌ టూర్‌లో హార్ధిక్ కెప్టెన్సీ, క్రికెట్ ఫ్యాన్స్‌ని ఏ మాత్రం మెప్పించలేకపోయింది...

26

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ చేతుల్లో రెండో వన్డే ఓడిన టీమిండియా, టీ20 సిరీస్‌ని 3-2 తేడాతో కోల్పోయింది. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా చేసిన బౌలింగ్ మార్పులు, వ్యూహాత్మిక తప్పిదాలు టీమిండియా ఓటమికి ప్రధాన కారణం...
 

36
Hardik Pandya


అదీకాకుండా మ్యాచ్ ఈజీగా గెలిచేలా ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న హార్ధిక్ పాండ్యా, కాస్త తేడా కొట్టేలా ఉందనిపిస్తే సంజూ శాంసన్‌ని నాలుగో స్థానంలో బ్యాటింగ్ పంపించాడు. మూడో టీ20లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో ఉండగా సిక్సర్ బాది మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు హార్ధిక్ పాండ్యా..

46
Hardik Pandya

ఇవన్నీ హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై బీసీసీఐకి అసంతృప్తి కలిగేలా చేశాయట. ‘సీనియారిటీ ప్రకారం చూసుకున్నా, జస్ప్రిత్ బుమ్రా, 2022లోనే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గానూ ఉన్నాడు. అతను గాయంతో టీమ్‌కి దూరంగా ఉండడం వల్లే హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ దక్కింది..

56

జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడంతో ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీల్లో జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రుతురాజ్ గైక్వాడ్‌కి కాకుండా ఐర్లాండ్ టూర్‌లో జస్ప్రిత్ బుమ్రాకి కెప్టెన్సీ ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం.. ’ అంటూ కామెంట్ చేశాడు ఓ బీసీసీఐ అధికారి..

66

రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత వైట్ బాల్ ఫార్మాట్‌కి హార్ధిక్ పాండ్యా, టెస్టు ఫార్మాట్‌కి జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తారని వార్తలు వచ్చాయి. అయితే చూస్తుంటే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలను జస్ప్రిత్ బుమ్రాకే అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం.. 

click me!

Recommended Stories