ఐపీఎల్ 2025 : రిషబ్ పంత్‌ను ఢిల్లీ ఎందుకు వ‌దులుకుంది?

First Published | Nov 27, 2024, 9:17 PM IST

Rishabh Pant: డీసీ భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ రిష‌బ్ పంత్ ను వ‌దులుకోవ‌డానికి డబ్బు ప్రధాన కారణమని పలువురు ఊహించగా, ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్థ్ జిందాల్ ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.
 

Rishabh Pant: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 వేలంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌క్కా వ్యూహాల‌తో అడుగులు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. కానీ, భార‌త వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ రిష‌బ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ నుండి బ‌య‌ట‌కు రావ‌డం జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఒక నాయకుడిని కోల్పోవడమే కాకుండా తన జట్టుకు అనుకూలంగా ఆట గమనాన్ని మార్చగల నమ్మకమైన బ్యాటర్‌ను కూడా కోల్పోయింది. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిష‌బ్ పంత్ ను ఐపీఎల్ వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వ‌దులుకుంది. అత‌న్ని డీసీ విడిచిపెట్టడానికి డబ్బు ప్రధాన కారణమనే చర్చ క్రికెట్ వ‌ర్గాల్లో సాగింది. అయితే, తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సహ-యజమాని పార్థ్ జిందాల్ రిషబ్ పంత్‌ను ఎలా? ఎందుకు? వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నారనే విష‌యాలు ప్ర‌స్తావించారు. ప్రతిభావంతులైన ఆటగాడి సేవలను ఫ్రాంచైజీ ఎల్లప్పుడూ ఎలా కోల్పోతుందనే విష‌యాలను ప్ర‌స్తావిస్తూ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 


రిషబ్ పంత్‌ను డిసి ఎందుకు వదిలిపెట్టింది? 

"అతను ఫ్రాంచైజీని ఎలా ఆపరేట్ చేయాలనుకుంటున్నాడు.. మేము- యజమానులు - ఫ్రాంచైజీని ఎలా నిర్వహించాలని కోరుకుంటున్నాము అనేది కీల‌కం.. ఇది భిన్న‌మైన త‌త్వశాస్త్రం. అదే దానికి కారణమైంది. డబ్బుతో సంబంధం లేదు. రిషబ్ కు డబ్బు ఎప్పుడూ సమస్య కాదు. డబ్బు మాకు ఎప్పుడూ సమస్య కాదు. మేము ముగ్గురం (గ్రాంధి, జిందాల్,రిష‌బ్ పంత్) వేర్వేరు మార్గాల్లో ఉన్నామ‌నే నేను అనుకుంటున్నాను. అయితే, దీనికి ముగింపు ప‌ల‌కాల‌ని అన్ని ప్ర‌య‌త్నించాము. చివర్లో ఫోన్ చేశాడు. మేము అన్ని ప్రయత్నించాము, కానీ చివరికి అతను ముందుకు సాగడానికి సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నాడు" అని పార్థ్ చెప్పారు.

పంత్ ను పొంద‌లేక‌పోవ‌డం నిరాశే.. !

కొత్త సీజన్‌కు రిష‌బ్ పంత్ ను తిరిగి పొందకపోవడం పట్ల  పార్థ్ తన నిరాశను కూడా వ్యక్తం చేశాడు.
"పూర్తిగా విధ్వంసకరం. నేను ఆ అబ్బాయిని నా స్వంత సోదరుడిలా ప్రేమిస్తున్నాను. అతను రోజు చివరిలో కాల్ చేసాడు. మేము మా వంతు ప్రయత్నం చేసాము. అతను నిర్ణయం తీసుకున్నాడు. కాబ‌ట్టి దానిని మనం గౌరవించాలి" అని పేర్కొన్నాడు. అయితే, ఢిల్లీ టీమ్ రిష‌బ్ పంత్ సేవ‌ల‌ను కోల్పోయిన‌ప్ప‌టికీ.. వేలంలో బ‌ల‌మైన బ్యాటింగ్ లైనప్‌ను సొంతం చేసుకుంద‌నీ, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, అశుతోష్ శర్మ వంటి బ్యాట‌ర్లు ఉన్నార‌నే విష‌యాలు కూడా ప్ర‌స్తావించారు.

ఐపీఎల్ 2025 సీజ‌న్ లో ఢిల్లీలో బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్ 

పార్థ్ జిందాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాటింగ్ లైనప్ గురించి, ఐపీఎల్ 2025కి ముందు వారు బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎలా ఏర్పాటు చేయగలిగారు అనే విష‌యాలను గురించి కూడా మాట్లాడారు. "జట్టులో ఇప్పుడు ఉన్న ప్లేయర్లు కూడా మర్చిపోవద్దు. మీరు చెప్పినట్లుగా స్ట‌బ్స్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ల‌తో పాటు అశుతోష్ శర్మ  వంటి ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ల‌ను ఆడే బ్యాట‌ర్లు ఉన్నారు. వీరికి తోడుగా కేఎల్ రాహుల్, అక్ష‌ర్ ప‌టేల్, అభిషేక్ పోరెల్ కూడా జ‌ట్టులో ఉన్నారు. కాబ‌ట్టి మా బ్యాటింగ్ లైనప్ చాలా బ‌లంగా మారింది" అని పార్థ్ చెప్పారు.

Latest Videos

click me!