అతన్ని టీ20 వరల్డ్‌కప్‌కి ఎందుకు ఎంపిక చేయలేదు... కారణమేంటో చెప్పండి... సెహ్వాగ్ ఫైర్

First Published Sep 27, 2021, 10:48 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన జట్టులో కొన్ని పేర్లను చూసి అభిమానులు ఎంతగా ఆశ్చర్యపోయారో, కొందరి ప్లేయర్లు లేకపోవడం చూసి కూడా అంతే ఆశ్చర్యపోయారు... శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, శ్రేయాస్ అయ్యర్‌లతో పాటు టీ20ల్లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కకపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు యజ్వేంద్ర చాహాల్... 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 11 పరుగులు మాత్రమే ఇచ్చి, 3 వికెట్లు తీశాడు యజ్వేంద్ర చాహాల్...

ముంబై ఇండియన్స్‌లాంటి టాప్ టీమ్‌ను కట్టడి చేస్తూ అద్భుతమైన స్పెల్ వేసిన యజ్వేంద్ర చాహాల్‌కు టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ఎందుకు సెలక్ట్ చేయలేదో చెప్పాలంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

‘యజ్వేంద్ర చాహాల్‌ను టీ20 వరల్డ్‌కప్ జట్టుకి ఎందుకు ఎంపిక చేయలేదో నాకైతే అర్థం కాలేదు... చాహాల్‌ను ఎంపిక చేయకపోవడానికి ఏదైనా కారణం ఉండాలి కదా...

అతను ఫామ్‌లో లేడా? లేక అతని కంటే వేరే ప్లేయర్ ఎవరైనా అద్భుతంగా రాణిస్తున్నాడా... రాహుల్ చాహార్‌లో అయితే నాకు అలాంటి మ్యాజిక్ కనిపించలేదు... చాహాల్‌ను ఎందుకు పక్కన బెట్టారు... 

అతను ఏ జట్టులో అయినా ఈజీగా కలిసిపోగలడు... గత రెండు మ్యాచుల్లో యజ్వేంద్ర చాహాల్ పర్ఫామెన్స్ చూస్తే నాకేమీ కొత్తగా కనిపించలేదు... ఎన్నో ఏళ్లుగా చేస్తున్నదే ఇప్పుడూ చేశాడు...

శ్రీలంక టూర్‌లో కూడా యజ్వేంద్ర చాహాల్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్, యజ్వేంద్ర చాహాల్ స్పెల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాయి... 

మిడిల్ ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో చాహాల్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు... లేదంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఎలాంటి టార్గెట్‌నైనా ఈజీగా ఛేదించగలదు...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్..

టీమిండియా తరుపున 49 టీ20 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 63 వికెట్లు తీశాడు... గత మూడేళ్లుగా భారత జట్టుకి టీ20ల్లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న చాహాల్‌కి టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు... 
 

click me!