IPL2021 SRH vs RR: చెలరేగిన సంజూ శాంసన్... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు...

First Published Sep 27, 2021, 9:18 PM IST

IPL2021 RR vs SRH: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది... గత మ్యాచ్‌లో 125 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఈ లక్ష్యాన్ని కొట్టగలదా? అనేది అభిమానుల డౌట్...

భువనేశ్వర్ కుమార్ మొదటి బంతికే వికెట్ తీయడంతో ఇవిన్ లూయిస్ వికెట్‌ను త్వరగా కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్... 6 పరుగులు చేసిన లూయిస్, అబ్దుల్ సమద్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ కలిసి రెండో వికెట్‌కి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను సందీప్ శర్మ క్లీన్‌ బౌల్డ్ చేశాడు...

ఆ లియామ్ లివింగ్‌స్టోన్ 6 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 77 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్...

ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్‌తో కలిసి 86 పరుగులు జోడించాడు కెప్టెన్ సంజూ శాంసన్. సిద్ధార్థ్ కౌల్ వేసిన 16వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 20 పరుగులు రాబట్టాడు సంజూ శాంసన్...

57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసిన సంజూ శాంసన్... ఐపీఎల్ 2021 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా శిఖర్ ధావన్‌ని అధిగమించి, ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు...

ఆఖరి ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన సిద్ధార్థ్ కౌల్... సంజూ శాంసన్‌తో పాటు రియాన్ పరాగ్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మహిపాల్ ఇచ్చిన క్యాచ్‌ను అబ్దుల్ సమద్ డ్రాప్ చేశాడు... 

28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన మహిపాల్ లోమ్రోర్‌ నాటౌట్‌గా నిలవగా, సన్‌రైజర్స్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా, భువీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ తలా ఓ వికెట్ తీశారు..

click me!