సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత జట్టు కంటే ఎక్కువగా అభిమానించాడు డేవిడ్ వార్నర్. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తాను చేయాల్సిన దాని కంటే ఎక్కువే చేస్తూ వచ్చాడు...
ఆర్‌సీబీకి, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ వంటి జట్లకీ ప్రతీ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసే ప్లేయర్ మారుతూ వచ్చారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయంలో మాత్రం సీజన్ మారినా, లీడింగ్ రన్ స్కోరర్ మాత్రం వార్నర్ భాయ్...
అసలు సరైన బ్యాట్స్‌మెన్ కూడా లేని జట్టు, ఐపీఎల్‌లో నాలుగు సార్లు ఫ్లేఆఫ్ చేరిందంటే దానికి ఒకే ఒక్క కారణం డేవిడ్ వార్నర్... వార్నర్ భాయ్ జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తూ ఉండడం వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పెద్దగా చేసిదేం లేదు...
మిగిలిన జట్లు, ఐపీఎల్ వేలంలో స్టార్ ప్లేయర్లను, సత్తా ఉన్న క్రికెటర్లను కొనుగోలు చేయడానికి పోటీపడుతుంటే... సన్‌రైజర్స్ మాత్రం ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి కాకుండా అక్కడ ఇచ్చే టీ, కాఫీ, స్నాక్స్ తినడానికే వెళ్తున్నట్టుగా ఉండేది...
ఐపీఎల్‌లో మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన డేవిడ్ వార్నర్, 5వేలకు పరుగులు సాధించిన ఏకైక ఫారిన్ ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...
2014 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి వచ్చిన డేవిడ్ వార్నర్, 2015 నుంచి ఆరెంజ్ ఆర్మీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు... ఎస్‌ఆర్‌హెచ్‌లో భువనేశ్వర్ కుమార్ మినహా మరో ఇండియన్ స్టార్ ప్లేయర్ లేకున్నా, జట్టును అద్భుతంగా నడిపిస్తూ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు...
2016లో అండర్ డాగ్స్‌లో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఫైనల్‌లో ఓడించి, టైటిల్ సాధించింది. ఆ సీజన్‌లో 848 పరుగులు చేసి, సంచలన ప్రదర్శన ఇచ్చాడు వార్నర్ భాయ్...
బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా 2018 ఐపీఎల్ సీజన్‌లో కెప్టెన్సీ, ఐపీఎల్‌కి దూరమైన డేవిడ్ వార్నర్... ఆ తర్వాత 2019లో ఎంట్రీతోనే ఆరెంజ్ క్యాప్ గెలిచి అదరగొట్టాడు...
గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌ను, కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాతి మ్యాచ్‌లో తుది జట్టులో నుంచి తీసేశారు...
ఈ సీజన్‌లో మేనేజ్‌మెంట్‌తో వచ్చిన విభేదాల కారణంగా అతను జట్టుకే దూరమయ్యే స్థితికి వచ్చాడు... 2021 సీజన్‌లో ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడిన తర్వాత కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌ను తప్పిస్తూ, కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఎంతో అభిమానం పెంచుకున్న డేవిడ్ వార్నర్, ఆరెంజ్ ఆర్మీని తన సెకండ్ హోమ్‌గా అభివర్ణించాడు. ఫస్టాఫ్‌లో జట్టులో చోటు కోల్పోయినప్పుడే వార్నర్ భాయ్ ఎంత బాధపడ్డాడో అతని పోస్టులు చూస్తే అర్థమవుతుంది...
విరాట్ కోహ్లీ భార్య అనుష్ శర్మ కానీ, ఎమ్మెస్ ధోనీ భార్య సాక్షి సింగ్ కానీ ఏనాడూ ఐపీఎల్ జెర్సీల్లో కనిపించింది లేదు. అయితే డేవిడ్ వార్నర్ ఫ్యామిలీ మొత్తం ఆరెంజ్ ఆర్మీ జెర్సీలు ధరించి, జట్టును విషెస్ చేసేవాళ్లు...
ఓ జట్టుతో ఎమోషనల్‌గా ఇంతటి అటాచ్‌మెంట్ పెంచుకున్న ప్లేయర్ బహుశా డేవిడ్ వార్నర్ ఒక్కడేనేమో. అలాగే వార్నర్ లేకపోతే సన్‌రైజర్స్‌కి ఉన్న కూసింత ఫాలోయింగ్ కూడా పోవడం ఖాయమంటున్నారు అభిమానులు...
డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉన్నప్పుడు జట్టు భారాన్ని మోస్తూ, సన్‌రజర్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఇప్పుడు అతను ఫామ్‌లో లేనప్పుడు వార్నర్ భాయ్‌కి తోడుగా ఉండాల్సిన బాధ్యతను విస్మరించి, తనని జట్టు నుంచి తీసేయడానికి అవకాశంగా వాడుకుంటోంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
మరికొందరు అభిమానులైతే డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియోలు, ఫన్నీ వీడియోలను అతని పర్ఫామెన్స్‌కి లింక్ పెడుతూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు...
ఎవరెన్ని రకాలుగా విమర్శలు చేసినా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోసం డేవిడ్ వార్నర్ పడిన తపన, చూపించిన అంకితభావం, తాపత్రయం, ఫ్రాంఛైజీని సొంత జట్టులా ఫీల్ అయిన డెడికేషన్ మాత్రం మన ప్లేయర్లలో కూడా ఎవ్వరూ చూపించలేదనేది నూటికి 200 శాతం నిజం...
‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాకు ఎంతో విలువైనది. నిజం చెప్పాలంటే సన్‌రైజర్స్ నా కుటుంబంలో భాగం. నాకు ఇండియా రెండో ఇళ్లు. ఈ ఫ్రాంఛైజీ కోసం ఏం చేయడానికైనా వెనుకాడను’ అంటూ ఆరెంజ్ ఆర్మీతో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు డేవిడ్ వార్నర్...