అంతా కలిసి కట్టుగా ఓడితే, అతనొక్కడినే అంటారేంటి... ట్రోల్స్‌పై మాజీ క్రికెటర్ అరుణ్ లాల్...

First Published Jun 26, 2021, 3:46 PM IST

టీమిండియా ఏ మ్యాచ్‌లో ఓడినా ముందుగా విమర్శలు వచ్చేది కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి తర్వాత మరోసారి ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు కోహ్లీ...

టీమిండియా కెప్టెన్‌‌గా విరాట్ కోహ్లీని తప్పించాలని... ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఒక్క ఐసీసీ టోర్నీ కూడా అతను గెలవలేకపోయాడని విమర్శలు రేగాయి. రోహిత్ శర్మ, ధోనీ ఫ్యాన్స్ కెప్టెన్‌గా కోహ్లీ పనికిరాడంటూ ట్రోల్ చేస్తున్నారు...
undefined
‘అవును, విరాట్ కోహ్లీ తప్పులు చేశాడు. బ్యాటింగ్‌లో కొన్ని తప్పిదాల కారణంగా అవుట్ అయ్యాడు. క్రికెట్‌లో అలాంటివి సహజం. ఫైనల్ మ్యాచ్ కావడంతో అతనిపై చాలా ప్రెజర్ ఉంది...
undefined
అదీకాకుండా పిచ్ బౌలింగ్‌కి అనుకూలిస్తుండడంతో బంతి స్వింగ్ అవుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బంతి కవర్ చేయబోయిన విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో అయితే అతన్ని బ్యాడ్‌లక్ వెంటాడింది. కేల్ జెమ్మీసన్ అద్భుతమైన స్పెల్ వేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్‌ను అవుట్ చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో బరిలో దిగినట్టు అనిపించింది...
undefined
కోహ్లీ ఆడింది బ్యాడ్ షాట్ కాదు. బంతికి రెండు అడుగుల దూరంలో అతని కాలు ఉంది. అదే పొజిషన్‌లో నిలబడి బౌండరీ కొడితే... దాన్ని క్లాసీ షాట్ అంటూ ప్రశంసిస్తారు...
undefined
షాట్ ఆడబోయి మిస్ అయితే... అది ఎడ్జ్ తీసుకుని వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లే ఫుట్ వర్క్ లేదు, బాడీకి దూరంగా ఆడుతున్నాడు. ఇదో చెత్త షాట్... అంటూ విమర్శిస్తారు...
undefined
భారత బ్యాట్స్‌మెన్ అందరూ డ్యూక్స్ బంతిని ఎదుర్కోవడానికి బాగా ఇబ్బంది పడ్డారు. కానీ కేవలం విరాట్ కోహ్లీని మాత్రమే అంటున్నారెందుకు...
undefined
తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ అమూల్యమైనది. అయితే దురదృష్టవశాత్తు అతను సెంచరీ మార్కు చాలా దూరంగా అవుట్ అవ్వాల్సి వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్...
undefined
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 217 పరుగులకి ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేయగా, అజింకా రహానే 49 పరుగులు చేశాడు...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 41 పరుగులు చేసి హై స్కోరర్‌గా నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్ అందరూ ముకుమ్మడిగా ఫెయిల్ అయినా కోహ్లీనే ట్రోల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు అరుణ్ లాల్.
undefined
click me!