మిగిలిన దేశాల కంటే ఆస్ట్రేలియా నుంచి ఐపీఎల్‌లో పాల్గొనే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, ఆడమ్ జంపా... ఇలా దాదాపు 24 మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంఛైజీల తరుపున ఆడుతున్నారు...
కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులను సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభించాలని చూస్తోంది బీసీసీఐ. ఇప్పటికే యూఏఈ వేదికగా మిగిలిన మ్యాచులు పూర్తిచేస్తామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించినా డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు..
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా ఆడే ట్రై సిరీస్ నుంచి రెస్టు కావాలని కొందరు ఆసీస్ క్రికెటర్లు కోరారు. దేశం తరుపున ఆడడం కంటే, ఐపీఎల్ ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో పాల్గొనడం కోసం రెస్టు కావాలని కోరుకుంటే మాత్రం... అలాంటి వాళ్లు టీ20 వరల్డ్‌కప్ ఆడే జట్టులో చోటు ఆశించకూడదని ఆసీస్ వన్డే, టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ హెచ్చరించాడు కూడా. (ఫించ్, ఐపీఎల్ 2021 వేలంలో అమ్ముడుపోని ప్లేయర్లలో ఒకడిగా నిలిచిన విషయం తెలిసిందే)
‘ఆటగాళ్లు సంపాదించుకోవడాన్ని నేనెప్పుడూ కాదనను. అది చాలా మంచి విషయం. కానీ దేశం తరుపున ఆడకుండా ఐపీఎల్‌లో ఆడి డబ్బు సంపాదించుకోవాలని అనుకుంటే మాత్రం అది క్షమించరాని నేరం అవుతుంది...
అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉండి, ఐపీఎల్‌లో పాల్గొనాలని కోరుకునే వాళ్లను టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకండి. వాళ్లకి ఆ అర్హత లేదు. ఎందుకంటే ఇలాగే కొనసాగితే ప్లేయర్లు ఎవ్వరూ టెస్టు మ్యాచులు ఆడడానికి ఇష్టపడరు.
అలాగే డబ్బుల కోసం దేశానికి ఆడడం కంటే, టీ20 లీగ్‌లు ఆడేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఇది క్రికెట్‌కి ఏ మాత్రం మంచిది కాదు.
కొన్ని మ్యాచులు ఆడి మూడు మిలియన్లు తీసుకోవడం లేదా ఆరు వారాలు కుటుంబానికి దూరంగా ఉండి ఎక్కడో క్రికెట్ ఆడడం మంచిదా అంటే చెప్పడం కష్టం...
చాలామంది డబ్బులు వచ్చే టోర్నీ ఆడేందుకే ఇష్టపడతారు. అయితే ఓ క్రికెటర్‌గా మీకు మీరు ఇచ్చే విలువ కేవలం డబ్బులోనే కనిపిస్తుందా... గొప్ప క్రికెటర్‌గా, ప్లేయర్‌గా చరిత్రలో నిలవాలంటే టీ20 లీగుల్లో కాదు, దేశం తరుపున... అదీ టెస్టుల్లో ఆడి చూపించాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్.