అతను భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ అవుతాడు... సచిన్ టెండూల్కర్ కితాబు...

First Published | Jun 26, 2021, 2:52 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో 7 వికెట్లు తీసిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ కేల్ జెమ్మీసన్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన విషయం తెలిసిందే. కేల్ జెమ్మీసన్, భవిష్యత్తులో వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్ అవుతాడని ప్రశంసించాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి... భారత జట్టు స్వల్ప స్కోరుకే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించిన కేల్ జెమ్మీసన్... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు...
బంతితోనే కాకుండా బ్యాటుతోనూ రాణించిన జెమ్మీసన్... 16 బంతుల్లో 21 పరుగులు చేసి లోయర్‌ ఆర్డర్‌లో కీలకమైన పరుగులు చేశాడు. జెమ్మీసన్‌తో పాటు టిమ్ సౌథీ మెరుపుల కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కి 32 పరుగుల ఆధిక్యం దక్కింది...

‘జెమ్మీసన్ వరల్డ్‌క్లాస్ బౌలర్. అతన్ని సరిగ్గా వాడుకుంటే న్యూజిలాండ్‌కి భవిష్యత్తులో ఓ అద్భుతమైన ఆల్‌రౌండర్ తయారవుతాడు. గత ఏడాది న్యూజిలాండ్‌లో అతన్ని చూశాను...
బాల్‌తోనే కాకుండా బ్యాటుతోనూ అతను చక్కగా రాణిస్తున్నాడు. అతని బౌలింగ్‌లో అనేక వేరియేషన్స్ చూపిస్తున్నాడు. మణికట్టుతో కరెక్ట్ యాంగిల్ రాబడుతూ ఇన్‌స్వింగర్లతో బౌలింగ్ చేస్తున్నాడు...
ఇప్పటిదాకా అతని బౌలింగ్‌లో రిథమ్ మిస్ కాలేదు. వరుసగా రాణిస్తూ న్యూజిలాండ్‌కి మ్యాచ్ విన్నర్‌గా మారిపోయాడు... భవిష్యత్తులో అతను పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌‌గా ఎదుగుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...
ఇప్పటిదాకా 8 టెస్టులు మాత్రమే ఆడిన అనుభవం కలిగిన కేల్ జెమ్మీసన్, 46 వికెట్లు పడగొట్టాడు. 42.66 సగటుతో బౌలింగ్ చేస్తున్న జెమ్మీసన్... విరాట్ కోహ్లీని ఇప్పటికే మూడు సార్లు అవుట్ చేశాడు...

Latest Videos

click me!