ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో బలమైన జట్లలో ఆర్సీబీ ఒకటి. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ ట్రోఫీని గెలవలేకపోయింది. ఆర్సీబీ 165 మంది ఆటగాళ్లను మార్చినా ట్రోఫీ గెలవలేకపోయింది. దీనికి ప్రధాన కారణం జట్టులో ఐక్యత లేకపోవడమే. ప్రతిసారి కూడా ఆ జట్టు కలిసి పోరాటం చేయడంలో విఫలమవుతోంది. ఒక ప్లేయర్ రాణిస్తే ఇతర ప్లేయర్లు చేతులెత్తేయడం చాలా మ్యాచ్ లలో చూశాం. అలాగే, బ్యాటర్లు రాణించిన సమయంలో బౌలర్లు విఫలం కావడం, బౌలింగ్ బాగున్న సమయంలో బ్యాటర్లు చెత్త ప్రదర్శన చేయడం వంటి కారణాలు ఆర్సీబీ టీమ్ ను ఛాంపియన్ కావడాన్ని అడ్డుకుంటున్నాయి.