విరాట్ కోహ్లీ అంటే పిచ్చి ఇష్టం.. క్రికెట్ బ్యూటీ క్వీన్ కోరిక ఇదే.. !

First Published | Aug 23, 2024, 10:34 AM IST

Virat Kohli-Xara Jetly : టీమిండిమా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అంతేకాదు చాలా మంది క్రికెటర్లు కూడా కోహ్లీని ఆరాధిస్తారు. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోని ఓ అందాల తార తాను కోహ్లీకి వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది.

క్రికెట్ ప్రపంచంలో రన్ మిషన్, ఆధునిక క్రికెట్‌లో సూపర్ స్టార్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరు, దూకుడు స్వభావంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
 

ఎంతో మంది యువ క్రికెటర్లకు విరాట్ కోహ్లీ స్ఫూర్తి ప్రదాత. అభిమానులు మాత్రమే కాదు, యువ క్రికెటర్లు, విదేశీ క్రికెటర్లు సైతం అవకాశం దొరికినప్పుడల్లా విరాట్ కోహ్లీతో ఫోటోలు దిగడానికి, ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


ఇప్పుడు మహిళా క్రికెట్ ప్రపంచంలో అందాల తారగా పేరుగాంచిన న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు ఆఫ్ స్పిన్నర్ క్సారా జెట్లీ.. తాను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చింది. ఇంతే చెప్పి ఉంటే అది పెద్ద వార్త అయ్యేది కాదు. దీనితో పాటు ఓ కోరిక కూడా వ్యక్తం చేసింది.

అవును, కివీస్ మహిళా క్రికెటర్ క్సారా జెట్లీ.. విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలని కోరుకుంటుందట. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయాలని ఉందని తన కోరికను వ్యక్తం చేసింది.

22 ఏళ్ల  యంగ్ ప్లేయర్  క్సారా జెట్లీ.. 'ఫైన్ లెగ్స్' అనే ప్రముఖ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో తన కోరికను వెల్లడించింది. క్సారా జెట్లీ.. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్‌లో వెల్లింగ్టన్ బ్లేజ్ జట్టుకు ఆడుతున్నారు.


అదే పాడ్‌కాస్ట్‌లో మీకు ఓ పురుష క్రికెటర్‌కు బౌలింగ్ వేసే అవకాశం వస్తే ఎవరికి బౌలింగ్ వేస్తారు అని అడిగిన ప్రశ్నకు క్సారా జెట్లీ.. సెకండ్ థాట్ లేకుండా విరాట్ కోహ్లీ అని చెప్పేసింది.

అందమైన రూపం, అద్భుతమైన క్రికెట్ నైపుణ్యాలతో క్సారా జెట్లీకి కూడా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో మస్తు ఫాలోయింగ్, భారీగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 113k మంది ఫాలోవర్లు ఉన్నారు.

Latest Videos

click me!