విరాట్ కోహ్లీ-బాబర్ ఆజంలను దాటేసిన శుభ్‌మన్ గిల్

Published : Aug 22, 2024, 01:37 PM ISTUpdated : Aug 22, 2024, 01:44 PM IST

Shubman Gill surpasses Virat Kohli-Babar Azam : అత్యధిక వన్డే బ్యాటింగ్ సగటుతో ప్రస్తుతం ఆడుతున్న టాప్-10 క్రికెట‌ర్ల జాబితాలో ఉన్న భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ స్టార్ బాబార్ ఆజంల‌ను టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ శుభ్ మ‌న్ గిల్ అధిగ‌మించాడు. ఈ లిస్టులో ఉన్న టాప్-10 ప్లేయ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి..  

PREV
15
విరాట్ కోహ్లీ-బాబర్ ఆజంలను దాటేసిన శుభ్‌మన్ గిల్
Image credit: PTI

Shubman Gill surpasses Virat Kohli-Babar Azam : ప్ర‌స్తుతం క్రికెట్ లో కొన‌సాగుతూ అత్య‌ధిక వ‌న్డే ప‌రుగుల స‌గ‌టుతో ఉన్న టాప్-10 క్రికెట‌ర్ల‌లో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 48.64 బ్యాటింగ్ సగటుతో 10వ స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత టీమిండియా వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ 49.15 బ్యాటింగ్ సగటుతో 9వ  స్థానంలో ఉన్నాడు.

25

ఈ లిస్టులో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 49.16 బ్యాటింగ్ సగటుతో 8వ స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత ఐర్లాండ్ ప్లేయ‌ర్ హ్యారీ టెక్టర్ వ‌న్డే క్రికెట్‌లో 49.91 బ్యాటింగ్ సగటుతో 7వ స్థానంలో ఉన్నాడు.

35

వ‌న్డేల్లో అత్య‌ధిక స‌గ‌టు ఉన్న టాప్-10 ప్లేయ‌ర్ల లిస్టులో వెస్టిండీస్ క్రికెట‌ర్ షాయ్ హోప్ 50.26 బ్యాటింగ్ సగటుతో 5వ స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత దక్షిణాఫ్రికా క్రికెట‌ర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 52.44 బ్యాటింగ్ సగటుతో 5వ స్థానంలో ఉన్నాడు. 

45

న్యూజిలాండ్ క్రికెట‌ర్ డారిల్ మిచెల్ 52.56 వ‌న్డే బ్యాటింగ్ సగటుతో 4వ స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం 56.72 బ్యాటింగ్ సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు.

55
Image credit: PTI

వ‌న్డే క్రికెట్ లో ప్ర‌స్తుతం క్రికెట్ లో కొన‌సాగుతూ అత్య‌ధిక బ్యాటింగ్ సగ‌టు ఉన్న టాప్-10 ప్లేయ‌ర్ల‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్, ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ 58.18 బ్యాటింగ్ సగటుతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్‌లో 58.20 బ్యాటింగ్ సగటుతో టాప్ లో కొన‌సాగుతున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories