Sachin Tendulkar, Virat Kohli, team India,
India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా మధ్య 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాల్గవ టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. డిసెంబర్ 26న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై ఇరు జట్లు గెలుపు పై దృష్టి పెట్టాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల అనంతరం సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగా, బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇప్పుడు మెల్‌బోర్న్‌లో కీలక మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించడంపైనే ఇరుజట్ల దృష్టి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి భారీ రికార్డు సాధించే ఛాన్స్ ఉంది. అయితే మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు ఎవరో తెలుసుకుందాం.
Sachin Tendulkar
1. సచిన్ టెండూల్కర్
మెల్‌బోర్న్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. మాస్టర్ బ్లాస్టర్ 10 మ్యాచ్‌ల్లో 44.9 సగటుతో 449 పరుగులు చేశాడు. అతను MCGలో తన టెస్ట్ మ్యాచ్‌లలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. మొత్తంగా భారత్ తరపున ఈ గ్రామంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు.
2. అజింక్య రహానే
అజింక్య రహానే MCGలో ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 73.8 సగటుతో 369 పరుగులు చేశాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ MCGలో రెండు టెస్టు సెంచరీలు సాధించాడు. చివరిసారి మెల్‌బోర్న్‌లో జరిగిన సిరీస్‌లో అతను జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను ఒక సెంచరీ కూడా చేశాడు.
3. విరాట్ కోహ్లీ
భారత స్టార్ బ్యాట్స్ మెన్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరు మ్యాచ్‌ల్లో 52.7 సగటుతో 316 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. రహానెను అధిగమించాలంటే కోహ్లీ 54 పరుగులు చేయాల్సి ఉంటుంది. అలాగే సచిన్ టెండూల్కర్ ను అధిగమించాలంటే 134 పరుగులు చేయాలి. తొలి టెస్ట్ లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ తర్వాత పెద్ద ఇన్నింగ్స్ లో అడగలేకపోయాడు. మరి ఈ గ్రౌండ్ లో ఏం చేస్తాడో చూడాలి మరి.
cricket virender sehwag
4. వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా స్టార్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై ఎన్నో ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఎంసీజీలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను MCGలో తన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో సహా 280 పరుగులు చేశాడు. ఈ గ్రౌండ్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ల లిస్టులో నాలుగో స్థానంలో ఉన్నాడు
.
5. రాహుల్ ద్రవిడ్
భారత జట్టు మాజీ కెప్టెన్ ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రవిడ్ ఎన్నోసార్లు ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చిన ఆడాడు. ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. రాహుల్ ద్రవిడ్ ఎంసీజీలో ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను MCGలో తన టెస్ట్ కెరీర్‌లో రెండు అర్ధ సెంచరీలతో సహా 263 పరుగులు చేశాడు.