ఆ గదిలో విరాట్ కోహ్లీ ఒంటరిగా ఏడుస్తున్నాడు..

First Published | Dec 20, 2024, 7:01 PM IST

Virat Kohli: భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ-అనుష్కల సంబంధం గురించి బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఒక షోలో మాట్లాడుతూ ఒక పెద్ద సంఘటన గురించి చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ విష‌యం వైర‌ల్ గా మారింది. 
 

Virat Kohli: విరాట్ కోహ్లీ ప్ర‌పంచ క్రికెట్ లో ర‌న్ మిష‌న్ గా గుర్తింపు పొందిన స్టార్ ప్లేయ‌ర్. క్రికెట్ లో అనేక రికార్డులు సాధించాడు. క్రికెట్ లెజెండ‌రీ ప్లేయ‌ర్ల లిస్టులో చేరాడు. అయితే, విరాట్ గురించి బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ పంచుకున్న ఒక విష‌యం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. అతని భార్య అనుష్క శర్మ కూడా తోడుగా ఉంది. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం ద్వారా ఫామ్‌లో ఉన్నట్లు బ్యాట్ తో తెలిపాడు. కానీ రెండో, మూడో టెస్టు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

దీంతో విరాట్ కోహ్లీ ఆట‌తీరుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాదు రిటైర్మెంట్ తీసుకోవాల‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో క్రికెట్ స‌ర్కిల్ లో కింగ్ కోహ్లీ హాట్ టాపిక్ గా మారాడు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్.. విరాట్ కోహ్లీకి క్రికెట్ పై ఉన్న ప్రేమ, పిచ్చికి సంబంధించి ఒక ఎమోషనల్ ఘటన గురించి చెప్పాడు.

వరుణ్ ధావన్ యూట్యూబ్ కంటెంట్ క్రియేట‌ర్ రణవీర్ అల్హబాడియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అనుష్క శర్మపై ప్ర‌శంస‌లు కురిపించాడు. అలాగే, విరాట్ కోహ్లీ విజయంలో ఆమె ఎంత ముఖ్యమో చెప్పాడు. అలాగే, 2018లో నాటింగ్‌హామ్ టెస్టు క్రమంలో విరాట్ కోహ్లి ఏడ‌వ‌డం, జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు జరిగిన షాకింగ్ సంఘటనను ధావన్ వివరించాడు.


తాను అనుష్కతో సూయ్-ధాగా షూటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ గురించి చర్చ జరిగిందని ధావన్ చెప్పాడు. 2018లో నాటింగ్‌హామ్ టెస్ట్ సిరీస్ ఓటమికి విరాట్ తనను తాను నిందించుకున్నాడ‌నే విష‌యాన్ని వరుణ్ ధావన్‌తో  అనుష్క పంచుకున్న విష‌యాల గురించి తెలిపాడు. "విరాట్ కోహ్లి ప్రస్తుతం బ్యాడ్ ఫామ్ లో ఉన్నాడు. విరాట్ చాలా చాలా బాధ‌ను భరించాడు. అతను ఫామ్‌లో లేనప్పుడు, అతని మానసిక స్థితి గురించి అనుష్క నాతో పంచుకుందంటూ" ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడు. 

"బహుశా అది నాటింగ్‌హామ్ టెస్టు కావచ్చు. భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ రోజు ఆ మ్యాచ్ చూసేందుకు అనుష్క వెళ్లలేదు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తిరిగి వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఎక్కడున్నాడో ఆమెకు తెలియదు. ఆమె గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె చాలా బాధ ప‌డింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ రూమ్ లో ఏడుస్తున్నాడు. విరాట్ విఫలమైనందున జట్టు ఓటమిని ఎదుర్కొందని భావించాడు. కానీ విరాట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, అత‌ను జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు" అని వ‌రుణ్ ధావ‌న్ వివ‌రించాడు. 

కాగా, ఇంగ్లాండ్ పర్యటనలో 2018 నాటింగ్‌హామ్ టెస్టులో విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్ ల‌లో వ‌రుస‌గా 149 ప‌రుగులు, 51 పరుగులు చేశాడు. అయితే ఇంగ్లండ్ బౌలింగ్ ధాటికి భారత్ ఓడిపోయింది. ఆ స‌మ‌యంలో భార‌త జ‌ట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు.

అయితే, కోహ్లి 2021 పర్యటనలో ఇంగ్లండ్‌లో భార‌త జ‌ట్టుకు అద్భుత‌మైన విజ‌యాలు అందించాడు. ఓవల్, లార్డ్స్‌లో చిరస్మరణీయ విజయాలతో సిరీస్‌లోని మొదటి నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో 2-1 ఆధిక్యంలో భారత్‌కు ముందుకు సాగింది. అయితే, ఆ సిరీస్‌లోని చివరి మ్యాచ్ కోవిడ్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఆ మ్యాచ్‌ను పూర్తి చేయడానికి భారతదేశం ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చే సమయానికి, కోహ్లీ కెప్టెన్‌గా త‌ప్పుకున్నాడు.

Latest Videos

click me!