ఊతప్ప చేసిన నేరమేంటి?
అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపిఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన రాబిన్ ఊతప్ప బిజినెస్ మ్యాన్ గా మారాడు. ప్రస్తుతం సెంచురీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ ప్రైవేట్ కంపనీని నడుపుతున్నారు.
రాబిన్ ఊతప్పకు చెందిన ఈ కంపనీలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీరి సాలరీల్లోంచి ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) పేరుతో డబ్బులు కట్ చేసుకుంటున్నారు... కానీ వాటిని ఆ ఉద్యోగులు పిఎఫ్ ఖాతాలో జరమచేయడంలేదు. ఇలా ఇప్పటివరకు ఉద్యోగులకు చెందిన రూ.23 లక్షల పిఎఫ్ డబ్బులు తన సొంత అకౌంట్లో జమచేసుకున్నారట రాబిన్ ఊతప్ప.
సెంచురీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల అవకతవకలపై పీఎఫ్ రిజినల్ కమీషనర్ గోపాల్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ నెల ఆరంభంలో అంటే డిసెంబర్ 4న రాబిన్ ఊతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కమీషనర్ పోలీసులను ఆదేశించారు. ఇలా టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్ కు రంగం సిద్దం చేసారు.
అయితే ఊతప్ప అడ్రస్ కు పంపిన ఈ అరెస్ట్ వారెంట్ తిరిగి పిఎఫ్ ఆఫీసుకు చేరింది. దీంతో ఊతప్ప ఇళ్లు మారినట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. చట్టప్రకారం ఊతప్పపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు.