టీ20లు ముగిశాయి.. కివీస్‌తో వన్డేలకు అక్కడే ఉండేదెవరు..? ఇంటికి తిరిగొచ్చేదెవరు..?

Published : Nov 23, 2022, 02:31 PM IST

INDvsNZ: ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడే మూడు వన్డేలు కూడా ఆడాల్సి ఉంది. అయితే పొట్టి ఫార్మాట్ సిరీస్ ముగిశాక పలువురు భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వస్తుండగా మరికొందరు అక్కడే ఉండనున్నారు. 

PREV
17
టీ20లు ముగిశాయి.. కివీస్‌తో వన్డేలకు అక్కడే ఉండేదెవరు..? ఇంటికి తిరిగొచ్చేదెవరు..?
Image credit: Getty

న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ తో పాటు మూడు వన్డేలు ఆడేందుకు అక్కడికి వెళ్లిన టీమిండియా ఒక టాస్క్ ను పూర్తి చేసింది.  కివీస్ తో మూడు టీ20ల సిరీస్ మంగళవారంతో ముగిసింది. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. మూడో మ్యాచ్ లో కివీస్ ఇన్నింగ్స్ ముగిసి భారత్ 9 ఓవర్లు ఆడాక వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. 

27

అయితే టీ20 సిరీస్ ముగిసిన తర్వాత  భారత జట్టు ఇక వన్డేలపై ఫోకస్ పెట్టింది.  పొట్టి ఫార్మాట్ కు హార్ధిక్ పాండ్యా సారథిగా ఉండగా వన్డేలకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వన్డే సిరీస్ లో పలు మార్పలు జరుగనున్నాయి.  అవేంటంటే.. 

37

టీ20లకు కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ వన్డేలకు అందుబాటులో ఉండడు. ఆసియా కప్ నుంచి భారత్ ఆడిన ప్రతీ మ్యాచ్ లో భాగమవుతున్న పాండ్యాకు  రెస్ట్ ఇచ్చారు. దీంతో పాటు అతడు త్వరలో మొదలయ్యే బంగ్లాదేశ్ టూర్ లో వన్డే సిరీస్ కు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. 

47
Image credit: PTI

పాండ్యాతో పాటు ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ లు కూడా  న్యూజిలాండ్ తో వన్డే సిరీస్  లో పాల్గొనడం లేదు. ఆశ్చర్యకరంగా సిరాజ్, హర్షల్ పటేల్ లు బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో   టీమిండియాతో జాయిన్ అవుతారు. 

57
Image credit: PTI

ఇక కివీస్ తో వన్డే సిరీస్ కు గాను ధావన్ సారథ్యంలోని భారత జట్టులో ఆర్సీబీ యువ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్ చేరతాడు.  సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లు టీ20లో చోటు దక్కించుకున్నా అవకాశాలు రాలేదు. దీంతో వన్డే సిరీస్ లో అయినా వారికి చోటు దక్కుతుందని భావిస్తున్నారు.  టీ20లతో పాటు వన్డేలకు ఎంపికైనా శుభమన్ గిల్ వన్డేలలో ఆడనున్నాడు. 

67
umran malik

వీరితో పాటు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ లు   వన్డే జట్టులోకి వస్తారు. వీరిలో కుల్దీప్ సేన ఇప్పటివరకూ భారత జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. శార్దూల్, చాహర్ లు ఇటీవల భారత్ లో ముగిసిన సౌతాఫ్రికా సిరీస్ లో భాగమయ్యారు. 

77

న్యూజిలాండ్ తో వన్డేలకు భారత జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్),  రిషభ్ పంత్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ 

Read more Photos on
click me!

Recommended Stories