‘నేను చిన్న చిన్న విషయాలపై పెద్ద ఫోకస్ చేయను. నా రోజంతా చాలా బిజీగా గడిచిపోతుంది. కేవలం ముఖ్యమైన వాటిపైనే నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను. ఫిట్నెస్ మీద నా దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నేను కుటుంబానికి సమయం కేటాయిస్తాను. వంట చేయడం, పిల్లలను స్కూల్ కి పంపడం, వాళ్ల అవసరాలు తీర్చడం.. యూట్యూబ్ వీడియోలు చేయడం.. ఇలా బిజీ బిజీగా గడిచిపోతుంది. దీంతో.. నాకు జుట్టు దువ్వుకోవడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఎక్కువగా క్యాప్ పెట్టి కవర్ చేస్తుంటాను’ అని ఆమె చెప్పడం విశేషం.