ఐదో టెస్టుకి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌... ఆ ఇద్దరికీ ప్లేస్, భారత్‌పైకి అస్త్రంగా స్పిన్నర్‌...

Published : Sep 07, 2021, 05:04 PM IST

నాలుగో టెస్టులో ఊహించని ఓటమితో టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో వెనకబడిన ఇంగ్లాండ్ జట్టు... ఐదో టెస్టులో మరో స్నిన్నర్‌తో బరిలో దిగాలని నిర్ణయం తీసుకుంది... సిరీస్‌ నిలవాలంటే కచ్ఛితంగా గెలవాల్సిన మ్యాచులో అన్ని అస్త్రాలతో బరిలో దిగనుంది ఇంగ్లాండ్...

PREV
17
ఐదో టెస్టుకి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్‌... ఆ ఇద్దరికీ ప్లేస్, భారత్‌పైకి అస్త్రంగా స్పిన్నర్‌...

ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ ఆకట్టుకున్నా, స్పిన్‌కి అనుకూలించిన ఓవల్ పిచ్‌లో ఆశించిన పర్ఫామెన్స్ మాత్రం ఇవ్వలేకపోయాడు... 

27

నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కి రాని మొయిన్ ఆలీ, రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే 26 ఓవర్లు వేసిన మొయిన్ ఆలీ, ఏకంగా 4.5 రన్‌రేటుతో 118 పరుగులు సమర్పించుకున్నాడు...

37

దీంతో మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టులో స్పిన్ బౌలర్ జాక్ లీచ్‌ను బరిలో దింపాలని భావిస్తంది ఇంగ్లాండ్ జట్టు. జాక్ లీచ్‌పై టీమిండియాపై మంచి రికార్డు ఉంది...

47

భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా జాక్ లీచ్, టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. ఓవరాల్‌గా భారత్‌పై నాలుగు టెస్టుల్లో 28.72 యావరేజ్‌తో 18 వికెట్లు పడగొట్టాడు జాక్ లీచ్...

57

మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టులో జాక్ లీచ్‌తో పాటు ప్రధాన వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను కూడా ఆడించనుంది ఇంగ్లాండ్. భార్య డెలివరీ కోసం నాలుగో టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న బట్లర్, తిరిగి జట్టుతో కలిశాడు...

67

నాలుగో టెస్టులో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో గాయపడిన క్రెగ్ ఓవర్టన్ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై సందేహాలున్నా, అతనికి ఐదో టెస్టుకి ప్రకటించిన జట్టులో చోటు దక్కింది...

77

ఐదో టెస్టుకి ఇంగ్లాండ్ జట్టు ఇది: జో రూట్ (కెప్టెన్), మొయిన్ ఆలీ, జేమ్స్ అండర్సన్, బెయిన్ స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్, ఓల్లీ పోప్, ఓల్లీ రాబిన్‌సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్

click me!

Recommended Stories