ఏది..? ఓ అదా..! కోహ్లి రికార్డు బ్రేక్ చేయడం పై పాక్ సారథి స్పందన.. బిల్డప్ బాబాయ్ ను మించిపోయాడుగా..

Published : Jul 05, 2022, 03:35 PM IST

Virat Kohli vs Babar Azam: పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ ప్రపంచ క్రికెట్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా ప్రశంసలందుకున్నాడు. కానీ సీనియర్  క్రికెటర్ల పై అతడి వ్యవహార శైలి మాత్రం.. 

PREV
17
ఏది..? ఓ అదా..! కోహ్లి రికార్డు బ్రేక్ చేయడం పై పాక్ సారథి స్పందన.. బిల్డప్ బాబాయ్ ను మించిపోయాడుగా..
Image Credit: Getty Images

ఆధునిక క్రికెట్ లో  టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ ల తర్వాత ఫ్యాబ్ 5 ప్లేయర్ గా ప్రశంసలు పొందుతున్నాడు పాకిస్తాన్  క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజమ్. 

27
Image Credit: Getty Images

టెక్నిక్, బ్యాటింగ్, నిలకడ.. ఇలా అన్ని విషయాలలో తనకంటూ  ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న బాబర్ నిస్సందేహంగా  నెంబర్ వన్ క్రికెటర్ అనడంలో సందేహమే లేదు.  మూడు ఫార్మాట్లలో నిలకడగా ఆడుతున్న అతడు.. ఇటీవలే  టీ20 ర్యాంకింగ్స్ లో కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 

37

ఈ క్రమంలో టీ20లలో అత్యధిక కాలం నెంబర్ వన్ (1000 రోజులు) గా ఉన్న కోహ్లి రికార్డును ఇటీవలే బాబర్ బ్రేక్ చేశాడు.  గతంలో కూడా  కోహ్లికి సంబంధించిన పలు రికార్డులను (కెప్టెన్ గా వన్డేలలో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులు) బాబర్ బద్దలుకొట్టాడు. 

47
Babar Azam

ఇక తాజాగా ఇదే విషయమై  శ్రీలంక పర్యటనకు వెళ్లబోతున్న పాకిస్తాన్ జట్టు సారథి నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాబర్  ఇచ్చిన బిల్డప్ మాములుగా లేదు. పాత్రికేయులలోంచి ఒకరు ‘మీరు ఇటీవలే విరాట్ కోహ్లి రికార్డులను బద్దలు కొట్టారు కదా..?’ అని ప్రశ్నించాడు. 

57

దానికి బాబర్ స్పందిస్తూ.. ‘ఏది..?’అని  తిరిగి ప్రశ్నించాడు. దానికి రిపోర్టర్.. ‘అదే.. టీ20లలో అత్యధిక కాలం నెంబర్ వన్ గా కొనసాగడం..’ అని బదులిచ్చాడు. అప్పుడు బాబర్ మళ్లీ స్పందిస్తూ.. ‘ఓ అదా.. దానికి నేను ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా అద్భుత ప్రదర్శనల వెనుక కఠోర శ్రమ దాగుంది..’ అని చెప్పాడు. 

67

అయితే బాబర్ స్పందన పై కోహ్లి, టీమిండియా ఫ్యాన్స్ అతడిపై ట్రోలింగ్ కు దిగారు. ‘నువ్వేదో కోహ్లి రికార్డులన్నీ బ్రేక్ చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావ్. కొన్ని రికార్డులు అధిగమించినంత మాత్రానికి మొత్తం ప్రపంచంలో  రికార్డులన్నీ నీ పేరు మీద రాసుకున్నంత ఫోజ్ కొడుతున్నావ్.. 

77

మావోడు (కోహ్లి) ఫామ్ లో లేడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయ్. లేకుంటే నీ గురించి పట్టించుకునేదెవరు..?’ అని ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories