అశ్విన్ ఉంటేనా, సీన్ వేరేగా ఉండేది... ఐదో టెస్టులో టీమిండియా చేసిన తప్పు ఇదేనా...

Published : Jul 05, 2022, 03:17 PM IST

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మొదటి మూడు రోజులు, ఆతిథ్య జట్టుపై పూర్తి డామినేషన్ చూపించిన భారత జట్టుకి నాలుగో రోజు ఊహించని షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్. 377 పరుగుల రికార్డు టార్గెట్‌ను ముందు పెడితే, దాన్ని కాస్తా ఈజీగా ఊడ్చిపడేసేలా ఆడుతోంది బెన్ స్టోక్స్ టీమ్...

PREV
18
అశ్విన్ ఉంటేనా, సీన్ వేరేగా ఉండేది... ఐదో టెస్టులో టీమిండియా చేసిన తప్పు ఇదేనా...

భారీ లక్ష్యఛేదనని మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకి ఓపెనర్లు 20 ఓవర్లలోనే శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి అదిరపోయే ఆరంభం అందించారు. ఆ తర్వాత వెంటవెంటనే మూడు వికెట్లు తీసి కమ్‌బ్యాక్ ఇచ్చినా సరిపోలేదు...

28

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న జో రూట్, జానీ బెయిర్‌స్టో కలిసి 197 బంతుల్లో 150 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, దాదాపు మ్యాచ్‌ని ముగించేశారు. ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 119 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, చేతిలో 7 వికెట్లు ఉన్నాయి...

38

ఇప్పుడు భారత జట్టు గెలవాలంటే ఆట ఐదో రోజు అద్భుతం జరగాల్సిందే. మొదటి మూడున్నర రోజులు ఇంగ్లాండ్‌పై పూర్తి డామినేషన్ చూపించిన భారత జట్టు, ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించి ఉండకపోవచ్చు... అయితే టీమిండియా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు ఇవ్వకపోవడమే కారణమంటున్నారు కొందరు అభిమానులు...

48

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్‌పై రవిచంద్రన్ అశ్విన్‌కి మంచి రికార్డు ఉంది. అశ్విన్ బౌలింగ్‌లో ఐదు సార్లు అవుట్ అయిన జో రూట్, భారత స్పిన్నర్ బౌలింగ్‌ని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బందిపడేవాడు...

58

అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని అయితే ఓ ఆటాడుకుంటాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటిదాకా బెన్ స్టోక్స్‌ని 10 సార్లు అవుట్ చేసిన రవిచంద్రన్ అశ్విన్‌న తుదిజట్టులో ఆడించకుండా టీమిండియా చాలా పెద్ద పొరపాటు చేసిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

68

మిగిలిన బౌలర్లు వికెట్లు తీయడానికి ఇబ్బందిపడుతున్నప్పుడు టీమిండియాకి కావాల్సిన బ్రేక్ ఇవ్వడం రవిచంద్రన్ అశ్విన్ స్పెషాలిటీ. అదీకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో కంటే రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ వికెట్లు తీయడం అశ్విన్‌కి అలవాటు. ఇప్పుడు టీమిండియా మిస్ అవుతున్నది ఇలాంటి బౌలర్‌నే...

78

నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగాలనే ప్లాన్, టీమిండియాకి పెద్దగా కలిసి రాలేదు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ అటు బ్యాటుతో కానీ, ఇటు బాల్‌తో కానీ ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. 

88
Image credit: Twitter

ఫీల్డింగ్‌లోనూ క్యాచ్ డ్రాప్ చేశాడుు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్‌ని ఆడించి ఉంటే... టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు...

click me!

Recommended Stories