క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పక్షపాత ధోరణిపై డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త ఏం పాపం చేశాడని.. ఇది అన్యాయమని సీఏపై విరుచుకుపడింది. వార్నర్ పై లీడర్ షిప్ బ్యాన్ ను వెంటనే ఎత్తేయాలని ఆమె కోరింది.
27
2018 లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా జట్టులో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరాన్ బాన్క్రాఫ్ట్ లు బాల్ టాంపరింగ్ కు పాల్పడి ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నారు.
37
వీరిలో వార్నర్ పై లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్ వేసింది సీఏ. స్మిత్ పై కూడా ఇదే తరహా నిషేధం విధించినా తర్వాత ఎత్తేసింది. ఇటీవలే యాషెస్ సిరీస్ సందర్భంగా ప్యాట్ కమిన్స్ ను టెస్టులకు సారథిగా నియమించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్మిత్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది.
47
అయితే స్మిత్ పై నిషేధం ఎత్తివేసి వార్నర్ పై మాత్రం కొనసాగిస్తుంది. తాజాగా క్యాండీస్ వార్నర్ ఈ పక్షపాత ధోరణిపై ప్రశ్నలు సంధించింది. ట్రిపుల్ ఎమ్ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.
57
‘నాకు తెలిసి వార్నర్ కెప్టెన్ గా ఉన్న 10 మ్యాచుల్లో ఒక్కటే ఓడాడు. కానీ అతడిని కెప్టెన్సీ నుంచి దూరం చేశారు. నాకు అన్యాయం ఇష్టం లేదు. అని నన్ను బాధపెడుతుంది. వార్నర్ యూఏఈ కి వెళ్లి కెప్టెన్సీ చేశాడు. ఇండియాకు వెళ్లి (ఐపీఎల్ లో) సారథిగా ఉన్నాడు. అక్కడ ప్రజలు వార్నర్ వాళ్ల సొంతవాడిలా అభిమానించారు.
67
నా భర్త పనితీరును ప్రశ్నించడం కాదు.. నేను డేవిడ్ కు మద్దతు గురించి ప్రశ్నిస్తున్నాను.’ అని పేర్కొంది. 2018 లో వార్నర్ పై నిషేధం వేసినప్పుడు తనకు బోర్డు నుంచి ఇతరుల నుంచి కావాల్సిన మద్దతు అందలేదని క్యాండీస్ వాపోయింది.
77
ఇదిలాఉండగా.. వార్నర్ పై ఉన్న లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్ ను పున: పరిశీలించాలని సీఏ భావిస్తున్నది. ఇందుకు సంబంధించి సీఏ చర్చిస్తున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.