టీమిండియాలోకి రావాలంటే ఇంతకంటే ఏం చేయాలి? ఈ సెంచరీలు చాలవా? సర్ఫరాజ్‌ను పక్కనబెట్టడంపై నెటిజన్ల ఆగ్రహం

Published : Nov 01, 2022, 03:57 PM IST

Sarfaraz Khan: దేశవాళీలో టన్నులకొద్దీ పరుగులు చేస్తున్నా  యువ ఆటగాళ్లను పట్టించుకోని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), ఆలిండియా చీఫ్ సెలక్షన్ కమిటీ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

PREV
16
టీమిండియాలోకి రావాలంటే ఇంతకంటే ఏం చేయాలి? ఈ  సెంచరీలు చాలవా? సర్ఫరాజ్‌ను పక్కనబెట్టడంపై నెటిజన్ల ఆగ్రహం

టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి నేరుగా బంగ్లాదేశ్ కు వచ్చి బంగ్లాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది.  ఈ మేరకు చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం జట్లను ప్రకటించింది. 

26

ఈ జట్లలో దేశవాళీలో అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్న పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్,  యశస్వి జైస్వాల్,  రవి బిష్ణోయ్ లను  ఎంపిక చేయకపోవడంపై  తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా సర్ఫరాజ్ ఖాన్ ను బంగ్లాదేశ్ తో టెస్టులలో ఎంపిక చేయకపోవడంపై నెటిజన్లు సెలక్టర్ల తీరుపై మండిపడుతున్నారు.  

36

కొద్దిరోజుల క్రితం సర్ఫరాజ్ ఖాన్ కూడా తాను బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు   తాను ఎంపిక అవుతానని ఆ మేరకు సెలక్టర్లు తనకు హామీ ఇచ్చారని కామెంట్స్ చేశాడు. కానీ తాజాగా ప్రకటించిన జట్టులో అతడి పేరు లేకపోవడంతో పృథ్వీ షా, రుతురాజ్, హనుమా విహారి మాదిరిగానే సర్ఫరాజ్ కూడా  సెలక్టర్ల చేతిలో మోసపోయాడని  నెటిజన్లు వాపోతున్నారు. 

46

దేశవాళీలో సర్ఫరాజ్ ఖాన్ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సర్ఫరాజ్ గడిచిన 21 ఇన్నింగ్స్ లలో 9 సెంచరీలు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలున్నాయి.   గణాంకాలు ఇలా ఉన్నాయి.. 125*,  127*, 34, 63, 0, 36, 45, 134, 59*, 40, 153, 165, 48, 63, 275, 6, 177,  78, 25,  226*, 331*  పరుగులు సాధించాడు.  

56

2021 - 22 రంజీ సీజన్ లో 982 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన  సర్ఫరాజ్..  2019 నుంచి  9 సెంచరీలు, 5 హాఫ్  సెంచరీలు చేశాడు.  2019 నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి సగటు.. 81.33గా ఉంది. ప్రపంచ క్రికెట్ లో  ప్రఖ్యాత దిగ్గజం  డాన్ బ్రాడ్మన్ తర్వాత ఇంత సగటు ఉన్న క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (మినిమమ్ 2 వేల పరుగులు చేసిన జాబితాలో) మాత్రమే. కానీ అటువంటి ఆటగాడిని బీసీసీఐ పక్కనబెట్టడం   దారుణమని  నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

66

ట్విటర్ వేదికగా పలువురు నెటిజన్లు చేతన్ శర్మ, బీసీసీఐ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ స్థాయిలో ఆడుతున్న క్రికెటర్లను కూడా మీరు జట్టులోకి ఎంపిక చేయడం లేదంటే ఇంకేం  చేస్తే వారిని జాతీయ జట్టుకు ఎంపిక చేస్తారని మండిపడుతున్నారు. బీసీసీఐ లో  పాలిటిక్స్ కు ఇదే నిదర్శనమని.. ఎంతో టాలెంట్ ఉన్న యువ ఆటగాళ్లను బీసీసీఐ నాశనం చేస్తుందని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

click me!

Recommended Stories