తమిళ తంబీలకు గేట్లు మూసినట్టేనా..? టీ20 ప్రపంచకప్ తర్వాత దినేశ్, అశ్విన్‌ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్..!

Published : Nov 01, 2022, 12:33 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో ఆడుతున్న ఇద్దరు తమిళ తంబీలకు  ఈ మెగా టోర్నీ తర్వాత  భారత జట్టులోకి చేరడం కష్టమేననే సంకేతాలు వెలువడ్డాయి.  తాజాగా ఆలిండియా సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనలకు ప్రకటించిన జట్టు ద్వారా ఇది సుస్పష్టమైంది. 

PREV
19
తమిళ తంబీలకు గేట్లు మూసినట్టేనా..? టీ20 ప్రపంచకప్ తర్వాత దినేశ్, అశ్విన్‌ల కెరీర్‌లకు ఎండ్ కార్డ్..!

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న  టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ఆడిన మూడు మ్యాచ్ లలో ఆడిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ ఆటగాళ్లు దినేశ్ కార్తీక్,  స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ల కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టేనా..?  ఈ ఇద్దరూ టీ20   ప్రపంచకప్ తర్వాత  టీ20 ఫార్మాట్ లో ఆడబోయే భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 
 

29

చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ సోమవారం ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పింది.  ప్రపంచకప్ ముగిసిన తర్వాత   భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.  ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.   ఈ రెండు ఫార్మాట్లలో ఏ ఒక్కదాంట్లో కూడా  కార్తీక్, అశ్విన్ ల పేరు లేదు.  
 

39

హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టులోకి తీసుకున్నవారి జాబితా చూస్తే  ఈ జట్టును 2024 టీ20 ప్రపంచకప్ కు సిద్ధం చేసేందుకు గాను ఇప్పట్నుంచే రోడ్  మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నదనే వాదనలూ వినిపిస్తున్నాయి.  
 

49

ఇక కార్తీక్, అశ్విన్ ల విషయానికొస్తే.. ఏడాదికాలంగా దేశవాళీతో పాటు గత ఐపీఎల్ లో మెరుపులు మెరిపించి తనలో ఇంక వాడి తగ్గలేదని నిరూపించుకోవడంతో  సెలక్టర్లు టీ20 ప్రపంచకప్ కు  కార్తీక్ ను ఎంపిక చేశారు.  2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ లో కనిపించని అతడు.. టీ20 లలో మాత్రం మెరుస్తుండటంతో  ఈ మెగా టోర్నీకి ఎంపిక చేశారు సెలక్టర్లు. 
 

59

అయితే కార్తీక్ మాత్రం  అంచనాలను అందుకోలేక చతికిలపడుతున్నాడు.  పాకిస్తాన్ తో పాటు రెండ్రోజుల క్రితం ముగిసిన  సౌతాఫ్రికా మ్యాచ్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు.  దీంతో అతడిని  పక్కనబెట్టి, ఆసీస్ పిచ్ ల మీద ఆడిన అనుభవమున్న రిషభ్ పంత్ తో ఆడించాలనే డిమాండ్లు  వినిపిస్తున్నాయి.

69

ప్రపంచకప్ లో భారత్ ఆడబోయే తర్వాత మ్యాచ్ (బంగ్లాదేశ్ తో)  కార్తీక్ తుది జట్టులో ఉండటం అనుమానమేనని బీసీసీఐ వర్గాల వాదన. దీంతో  కార్తీక్ రీఎంట్రీకి టీ20 ప్రపంచకప్ తో ముగింపు పడ్డట్టేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  సెలక్టర్లు కూడా ఈ ప్రపంచకప్ లో  కార్తీక్ ఒక అవకాశమిచ్చి చూద్దామనే భావనలో ఎంపిక చేశారని.. కానీ ఇక మీదట అతడు భారత జట్టుకు ఆడటం కలే అని  తెలుస్తున్నది. 
 

79

ఇక అశ్విన్ విషయానికొస్తే.. నాలుగేండ్ల విరామం తర్వాత గతేడాది టీ20 ప్రపంచకప్ ద్వారా తిరిగి ఈ ఫార్మాట్ లోకి  ఎంట్రీ ఇచ్చిన అతడు అడపాదడపా మ్యాచ్ లు ఆడినా  ప్రపంచకప్ లో  ఎంపికయ్యాడు. యుజ్వేంద్ర చాహల్ ను పక్కనబెట్టి మరీ భారత జట్టు అశ్విన్ ను తుది జట్టులోకి తీసుకుంటున్నది.  అయినా అశ్విన్ కూడా  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు.  

89

పాకిస్తాన్  తో మ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా.. సౌతాఫ్రికాతో మాత్రం తేలిపోయాడు.  ఈ మ్యాచ్ లో 4  ఓవర్లలో 43 పరుగులిచ్చాడు. భారత పేసర్లు విజయం కోసం తుదివరకు శ్రమించినా అశ్విన్ మాత్రం భారీగా పరుగులిచ్చుకుని టీమిండియా ఓటమిలో భాగం పంచుకున్నాడు. దీంతో అశ్విన్  ను కూడా పక్కనబెట్టడం ఖాయమేనని తెలుస్తున్నది.  

99

ఈ ఇద్దరి వైఫల్యాలతో పాటు  వయసు కూడా ప్రధాన సమస్యగా మారింది.  ప్రస్తుతం దినేశ్ కార్తీక్ వయసు 37 ఏండ్లు కాగా అశ్విన్ కు 36 ఏండ్లు. యువ ఆటగాళ్లు దేశవాళీతో పాటు ఐపీఎల్ లో మెరుపులు మెరిపిస్తూ జాతీయ జట్టులో అడుగిడాలని  ఎదురుచూపులు చూస్తున్న వేళ.. అశ్విన్, కార్తీక్ లకు వదిలించుకోవడమే బెటరనే   భావనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్టు తెలుస్తున్నది. 
 

click me!

Recommended Stories