ఇలాగైతే బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలి..? మిస్టర్ 360పై పాక్ మాజీ సారథుల ప్రశంసలు

First Published | Nov 7, 2022, 4:20 PM IST

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు బ్యాటింగ్ బాధ్యతలను మోస్తున్న వారిలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. విరాట్ కోహ్లీ తర్వాత ప్రతీ మ్యాచ్ లో అదరగొడుతున్న సూర్య.. ఈ మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నాడు.  

Image credit: Getty

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో భారత బ్యాటింగ్ కు వెన్నెముకగా మారిన సూర్యకుమార్ యాదవ్  పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ప్రతీ మ్యాచ్ లో అతడు ఆడుతున్న ఆటతీరుకు  ప్రస్తుత జనరేషన్ తో పాటు గత కాలపు దిగ్గజాలు కూడా  ముగ్దులవుతున్నారు. ఈ జాబితాలో దాయాది దేశం పాకిస్తాన్  క్రికెట్ జట్టుకు సారథులుగా పనిచేసిన  వసీం అక్రమ్, వకార్ యూనిస్ కూడా ఉన్నారు. 

జింబాబ్వేపై భారత జట్టు భారీ స్కోరు చేయడానికి కారణం సూర్యనే. రోహిత్, కోహ్లీ, పాండ్యా, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు వెనుదిరిగినా సూర్య మాత్రం  ఒంటిచేత్తో స్కోరుబోర్డును నడిపిస్తున్నాడు. నెదర్లాండ్స్, జింబాబ్వేతో పాటు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో కూడా ఇది నిరూపితమైంది. ఈ నేపథ్యంలో వకార్, అక్రమ్ లు స్పందించారు.


పాకిస్తాన్ కు చెందిన ఎ స్పోర్ట్స్ ఛానెల్  లో జరిగిన చర్చా కార్యక్రమంలో  అక్రమ్ మాట్లాడుతూ... ‘నా అభిప్రాయం ప్రకారం సూర్య మరో గ్రహం నుంచి వచ్చి ఉంటాడు. అతడు క్రికెట్ లో ప్రస్తుతం  తోపులు అనుకుంటున్న వారికంటే ప్రత్యేకమైన ఆటగాడు.  ఈ మెగా టోర్నీలో అతడి ఆట చూడండి.. చూస్తున్నకొద్దీ చూడబుద్ది అవుతున్నది. 

మరీ ముఖ్యంగా జింబాబ్వేపై.. ఈ మ్యాచ్ లో సూర్య ఆడిన షాట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒక్క జింబాబ్వేనే కాదు. ప్రపంచంలో దిగ్గజ బౌలర్లు అనుకునేవారందరిపై సూర్య ఆధిపత్యం చెలాయిస్తున్నాడు...’ అని అక్రమ్ తెలిపాడు. 

ఇక వకార్ మాట్లాడుతూ.. ‘సూర్య ఇలా ఆడితే బౌలర్లు ఎక్కడ బంతులు వేయాలి. టీ20 లలో అతడిని ఔట్ చేయడం ఎలా..? అని ప్రత్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నాయి. నాకు తెలిసి వన్డే, టెస్టులలో 
సూర్యను ఔట్ చేయడానికి ప్లాన్స్ వర్కవుట్ అవుతాయి గానీ టీ20లలో మాత్రం కష్టం.  బౌలర్లు ఆఫ్ సౌడ్ అవుట్ స్టంప్ కు దూరంగా బంతిని విసిరినా లెగ్ సైడ్  సిక్సర్ కొడుతున్నాడంటే అతడి సామర్థ్యం, టెక్నిక్ ను అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఈ విషయంలో పాకిస్తాన్ బౌలర్లను మెచ్చుకోవచ్చు. ఈ టోర్నీతో పాటు గతంలో కూడా అతడు పాకిస్తాన్ మీద  పెద్దగా సఫలం కాలేదు. పాక్ పేసర్లు షార్ట్ పిచ్ బంతులు విసిరి అతడిని ఔట్ చేశారు. నాకు  తెలిసి సూర్యను ఔట్ చేయడానికి అదే ఒక్క దారి ఉంది అనిపిస్తుంది..’ అని  చెప్పాడు. 

Latest Videos

click me!