ఐసీసీ వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది... 1983 నుంచి 2019 వరకూ...

First Published | Nov 7, 2022, 3:58 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 2021 టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించిన భారత జట్టు, 2022 టోర్నీలో ఐదింట్లో నాలుగు విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరింది. 1983 నుంచి ఐసీసీ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచుల్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది...

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా మొట్టమొదటి సెమీ ఫైనల్‌ వరకూ చేరింది 1983లోనే. 1983 వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తోనే సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది భారత జట్టు. మాంచెస్టర్‌లో జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 60 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 32 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది టీమిండియా...

India-Pakistan

1987 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లాండ్. వాఖండేలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 254 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో టీమిండియా 45.3 ఓవర్లలో 219 పరుగులకి ఆలౌట్ అయ్యి 35 పరుగుల తేడాతో ఓడింది...


Image credit: Getty

1996 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 251 పరుగులు చేసింది. టీమిండియా 34.1 ఓవర్లలో 120 పరుగులు చేసిన సమయంలో వర్షం కురిసింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లంకను విజేతగా ప్రకటించారు అంపైర్లు..

team India

1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ సెమీస్‌లో వెస్టిండీస్ చేతుల్లో ఓడింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 242 పరుగులు చేయగా విండీస్ ఈ టార్గెట్‌ని 47 ఓవర్లలో ఛేదించింది... 2000వ సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 95 పరుగుల తేడాతో విజయం అందుకుంది టీమిండియా. ఆ తర్వాత 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌పై సౌతాఫ్రికాపై, 2003 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో కెన్యాపై విజయాలు అందుకుంది భారత జట్టు...

2007 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా, 2011 వన్డే వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ని చిత్తు చేసింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచింది భారత జట్టు...

2014 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాని ఓడించి ఫైనల్ చేరింది టీమిండియా. 2000 నుంచి 2014 వరకూ ఐసీసీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచుల్లో వరుస విజయాలు అందుకుంది భారత జట్టు. అయితే 2015లో ఈ విజయాలకు బ్రేక్ పడింది. 2015 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 329 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా, 233 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

Cricket

2016 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించి ఫైనల్ చేరింది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతుల్లో పరాజయం పాలైంది భారత జట్టు...

ఓవరాల్‌గా 1983 నుంచి ఇప్పటిదాకా టీమిండియా 15 సార్లు ఐసీసీ టోర్నీల్లో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. వీటిల్లో ఆరుసార్లు ఓడిన భారత జట్టు, మిగిలిన 9 సార్లు ఫైనల్‌లోకి ప్రవేశించింది. 1987 వన్డే వరల్డ్ కప్ తర్వాత 35 ఏళ్లకు ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా..

Latest Videos

click me!