రోహిత్‌ని చూస్తే ఫిట్‌నెస్ ఎంత అవసరమో తెలుస్తుంది! అయినా మారడం లేదంటే... సల్మాన్ భట్ కామెంట్స్...

Published : Jun 01, 2023, 12:13 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టీమిండియా ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్... అందరూ అదరగొట్టారు. ఒక్క టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప...  

PREV
16
రోహిత్‌ని చూస్తే ఫిట్‌నెస్ ఎంత అవసరమో తెలుస్తుంది! అయినా మారడం లేదంటే... సల్మాన్ భట్ కామెంట్స్...
PTI Photo/R Senthil Kumar)(PTI05_24_2023_000212B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 20.75 సగటుతో 332 పరుగులే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత నాలుగు సీజన్ల కంటే బెటర్ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసినా జట్టుకి అవసరమైనప్పుడు మాత్రం రోహిత్ బ్యాటు నుంచి పరుగులు రాలేదు...

26
PTI Photo/Kunal Patil) (PTI05_26_2023_000255B)

‘రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ రెండు వేర్వేరు ప్రపంచాల్లాంటివాళ్లు. రోహిత్ శర్మ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. అతను టీమిండియా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు...

36

కెప్టెన్‌గా రోహిత్ శర్మ అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ అలా జరగడం లేదు. దానికి కారణం కూడా అందరికీ తెలుసు... ఫిట్‌నెస్. కెప్టెన్ పొజిషన్‌లో ఉన్నవ్యక్తి, టీమ్‌ మేట్స్‌కి ఆదర్శంగా ఉండాలి...

 

46
Rohit Sharma

అందరి కంటే ముందుండి నడిపించాలి. అప్పుడే టీమ్ మేట్స్, కెప్టెన్‌ని గౌరవిస్తారు. రోహిత్ శర్మను చూస్తేనే ఓ ప్లేయర్‌కి ఫిట్‌నెస్ ఎంత అవసరం అనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది....

56

రోహిత్ శర్మ ఫిట్‌గా ఉంటే అతని బ్యాటింగ్‌తో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ విషయం గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతోంది. అయినా అతని ఫిట్‌నెస్ మాత్రం మెరుగవ్వడం లేదు...
 

66
rohit sharma

రోహిత్ శర్మకు ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం ఇష్టం లేదని తెలుస్తోంది. దానికి కారణాలేంటో అతనికి మాత్రమే తెలుసేమో... నాకు తెలిసి, ధోనీ వయసు వచ్చేవరకూ రోహిత్ శర్మ ఆడలేడు, అతని ఫిట్‌నెస్ లెవెల్స్ అందుకు సహకరించవు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్.. 

Read more Photos on
click me!

Recommended Stories