కావాలనే అతన్ని తప్పించారు... అంబటి రాయుడు, 2019 వన్డే వరల్డ్ కప్ ఆడాల్సింది! - అనిల్ కుంబ్లే

First Published Jun 1, 2023, 9:33 AM IST

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు, ఐపీఎల్ 2023 ఫైనల్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు, 2019 వన్డే వరల్డ్ కప్‌కి ముందే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు...

2019 వన్డే వరల్డ్ కప్‌లో అంబటి రాయుడిని నాలుగో స్థానంలో ఆడించాలని అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ భావించాడు. అయితే సెలక్టర్లు మాత్రం టీమిండియాకి షాక్ ఇచ్చారు...

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా విజయ్ శంకర్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చిన సెలక్టర్లు, అప్పటికే 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు ఆడి 1700+ పరుగులు చేసిన అంబటి రాయుడిని పూర్తిగా పక్కనబెట్టేశారు..

Latest Videos


PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000330B)

తెలుగువాడైన అంబటి రాయుడికి, 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో చీఫ్ సెలక్టర్‌గా ఉన్న తెలుగు మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కి ఉన్న అభిప్రాయ భేదాల కారణంగానే అతన్ని కావాలని సైడ్ చేశాడనేది చాలా మంది అభిప్రాయం...

Ambati Rayudu

వన్డే వరల్డ్ కప్‌లో శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అంబటి రాయుడికి అవకాశం ఇవ్వకపోవడం... కావాలనే అతన్ని టీమ్ నుంచి తప్పించారనే వాదనలకు బలం చేకూర్చాయి.. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు..

‘అంబటి రాయుడు కచ్చితంగా 2019 వన్డే వరల్డ్ కప్ ఆడాల్సింది. అయితే అతన్ని ఎందుకు సెలక్ట్ చేయలేదనేది ఇప్పటికి చాలామందికి అర్థం కాని విషయం. అది చాలా పెద్ద తప్పిదం...

నాలుగో స్థానంలో అంబటి రాయుడిని వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ చేశారు. కానీ కావాలని టీమ్ నుంచి తప్పించారు. ఎందుకు ఇలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు అనిల్ కుంబ్లే...
 

2019 వన్డే వరల్డ్ కప్‌లో తనకి చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన అంబటి రాయుడు, విజయ్ శంకర్ గురించి వేసిన త్రీడీ ప్లేయర్ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. 

2018 ఐపీఎల్‌లో 600+ పరుగులు చేసిన అంబటి రాయుడిని కాదని 2018లో 212, 2019లో 244 పరుగులే చేసిన విజయ్ శంకర్‌ని వన్డే వరల్డ్ కప్‌ చేయడంలో లాజిక్ ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని లాజిక్.. 

2019 వన్డే వరల్డ్ కప్‌‌లో తనకి చోటు దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన అంబటి రాయుడు, అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ఆవేశంలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా, అంబటి రాయుడిని పూర్తిగా పక్కనబెట్టేశారు సెలక్టర్లు.. 

click me!