రిటైర్మెంట్ ఇవ్వగానే ధోనీ ఫోన్ చేశాడు! అది విని షాక్ అయ్యా.... డీజే బ్రావో ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Jun 1, 2023, 11:21 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌ కంటే ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లో ఎక్కువ మ్యాచులు ఆడిన కరేబియన్ ప్లేయర్లలో డీజే బ్రావో ఒకడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్ టీమ్స్‌కి ఆడిన బ్రావో.. 2022 తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నాడు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ, మొయిన్ ఆలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, రాబిన్ ఊతప్ప, దీపక్ చాహార్, డీజే బ్రావో, అంబటి రాయుడు వంటి పాత ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేసింది.
 

అయితే 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ ముగిసిన తర్వాత డీజే బ్రావో, ఐపీఎల్‌తో పాటు ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు..

Latest Videos


dhoni bravo

రిటైర్మెంట్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కి బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు డ్వేన్ బ్రావో. ప్లేయర్‌గా సీఎస్‌కే తరుపున మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన బ్రావో, కోచ్‌గా ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు...

‘ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియడం లేదు. ఏడాది క్రితం నేను ఐపీఎల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా. ప్లేయర్‌గా అదో నాకు ఎమోషనల్‌ మూమెంట్. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగించినందుకు గర్వపడుతున్నా...

dhoni bravo

అయితే రిటైర్మెంట్ ఇవ్వగానే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మాహీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, కోచింగ్ స్టాఫ్‌లో చేరాల్సిందిగా వాళ్లు కోరగానే షాక్ అయ్యా.. రిటైర్మెంట్ తర్వాత నా క్రికెట్ కెరీర్‌ గురించి నాకు పూర్తి క్లారిటీ ఉంది..

Dwayne Bravo

నాకు దేవుడిచ్చిన టాలెంట్‌ని కుర్రాళ్లతో పంచుకోవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. అదీ ఐపీఎల్ బెస్ట్ టీమ్‌కి కోచ్‌గా అంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది. సీజన్ మొత్తం మాకు ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది, వాళ్లే నిజమైన ఛాంపియన్స్...

కోచింగ్‌ స్టాఫ్‌లో నేను అందరి కంటే చిన్నోడిని. సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ సీజన్‌లో ప్రతీ మూమెంట్‌ ఎంతో ఎంజాయ్ చేశా.

Image credit: PTI

నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా... ఇది కేవలం ఆరంభం మాత్రమే...’ అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ డీజే బ్రావో... 

click me!