Kapil Dev on Kohli-Rohit:ప్రస్తుత భారత జట్టులో బ్యాటింగ్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు అవసరమున్నప్పుడు ఆడటం లేదని.. అటువంటి వాళ్లను జట్టులో కొనసాగించడమెందుకని కపిల్ దేవ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా తాజా, మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితో పాటు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ పై దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ ఫైర్ అయ్యాడు. ఆడనప్పుడు వారిని ఎందుకు కొనసాగించడమని ప్రశ్నించాడు.
28
ఈ ముగ్గురూ జట్టుకు అవసరమైనప్పుడు చేతులెత్తేస్తున్నారని, అలాంటి వాళ్లను జట్టు నుంచి తీసేసి ఇతరులకు అవకాశం కల్పించాలని కోరాడు.వారి ఫామ్ లేమి జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నదని కామెంట్స్ చేశాడు.
38
Image credit: IPL
ఒత్తిడిని అధిగమించి బ్యాట్ ఝుళిపించాలి. ఆ ముగ్గురికీ 150-160 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉంది. కానీ మనకు (టీమిండియాకు) బాగా అవసరమున్నప్పుడే వాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు. అప్పుడు ఒత్తిడి ఇంకా ఎక్కువవుతున్నది.. వాళ్లు ఫీయర్లెస్ క్రికెట్ ఆడాలి..’ అని చెప్పాడు.
48
Image Credit: PTI
ఇక కెఎల్ రాహుల్ గురించి మాట్లాడుతూ.. ‘మీరు రాహుల్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒకవేళ టీమ్ మేనెజ్మెంట్ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయమని ఆదేశిస్తే అతడు జస్ట్ 60 రన్స్ చేసి నాటౌట్ గా తిరిగొస్తానంటే కుదరదు.. జట్టుకు న్యాయం చేయాలి..’ అని తెలిపాడు.
58
ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చి చివరిదాకా క్రీజులో ఉన్నాడు రాహుల్. అయితే మరీ నిదానంగా ఆడాడు. జట్టును విజయతీరాలకు చేర్చకపోగా.. అతడు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో విఫలమయ్యాడు. ఇదే విషయాన్ని కపిల్ కూడా ఎత్తి చూపాడు.
68
ఇక కోహ్లి-రోహిత్ లు గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్నారు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్-15 సీజన్ లో 15 మ్యాచులాడిన కోహ్లి 341 పరుగులే చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. కానీ మూడు సార్లు డకౌట్ అయ్యాడు. పలుమార్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు.
78
మరోవైపు రోహిత్ శర్మకు కూడా ఈ సీజన్ అత్యంత చెత్త సీజన్ గా మిగిలిపోయింది. 14 మ్యాచులాడిన హిట్ మ్యాన్.. 268 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. కెఎల్ రాహుల్.. ఐపీఎల్ లో బాగానే రాణించినా టీమిండియా తరఫున ఆడేప్పుడు విఫలమవుతున్నాడు.
88
ఇదే విషయమై కపిల్ స్పందిస్తూ.. ‘ఆడే విధానం మార్చుకోవాలి. ఒకవేళ అది కుదరకుంటే ఆటగాళ్లనైనా మార్చేయండి. భారీ అంచనాలు ఉన్న ఆటగాడు బాగా ఆడతాడనే ఎవరైనా ఊహిస్తారు. బాగా ఫేమస్ అయితే సరిపోదు. అందుకు తగ్గట్టుగా ఆడాలి కదా..’ అని వ్యాఖ్యానించాడు.