ఎంత కాలం ఆడతానో తెలీదు, అందుకే ఆ కోరిక లేదు... భారత సీనియర్ పేసర్ కామెంట్...

Published : Jun 06, 2022, 12:51 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో సత్తా చాటిన సీనియర్ ప్లేయర్లలో ఉమేశ్ యాదవ్ ఒకడు. 2022 మెగా వేలంలో తొలుత అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్‌ని ఆఖర్లో బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. సీజన్‌లో మొదటి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్, కేకేఆర్‌కి కీలక వికెట్ టేకర్‌గా మారాడు...

PREV
18
ఎంత కాలం ఆడతానో తెలీదు, అందుకే ఆ కోరిక లేదు... భారత సీనియర్ పేసర్ కామెంట్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 16 వికెట్లు తీసి, 7.06 ఎకానమీతో అదరగొట్టాడు. 140 కి.మీ.ల వేగంతో బంతులు వేసి, సత్తా చాటాడు...

28

నాలుగేళ్ల క్రితం ఆఖరిగా వైట్ బాల్ క్రికెట్ ఆడిన ఉమేశ్ యాదవ్, రిటైర్మెంట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదో టెస్టుకి ఎంపికైన ఉమేశ్ యాదవ్, వన్డే, టీ20ల్లో రీఎంట్రీపై నమ్మకం లేదన్నాడు...

38

‘ఇప్పుడు నా వయసు 33 ఏళ్లు. ఇంకో రెండు మూడేళ్లు పోతే నా శరీరం ఆటకు ఎలా సహకరిస్తుందో చెప్పడం కష్టం. అందుకే ఇంకో ఐదేళ్లు ఆడతానని చెప్పలేను..

48

గాయాలు లేకుండా, నా శరీరం పరుగెత్తడానికి సహకరిస్తుంటే కచ్ఛితంగా క్రికెట్‌లో కొనసాగుతాను. అయితే ఒక్కసారి గాయపడితే, ఆ గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పని...
 

58

అందుకే ఇప్పుడు నాకు పెద్ద పెద్ద లక్ష్యాలు లేవు, 100 టెస్టులు ఆడతానన్న నమ్మకం కూడా లేదు. అందుకే ఎన్ని మ్యాచులు ఆడితే అన్ని, వాటిల్లో మంచి పర్పామెన్స్ ఇస్తే చాలని అనుకుంటున్నా... 

68
Umesh Yadav

టెస్టులు ఆడడం ఓ ప్రత్యేకమైన ఎమోషన్. నేను దేశం తరుపున 70-80 టెస్టులు ఆడానని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. అందుకే టెస్టులు మాత్రమే ఆడుతున్నందుకు నేనేం ఫీల్ కావడం లేదు...

78
Umesh Yadav

వచ్చే సీజన్‌లోనూ మంచి పర్ఫామెన్స్ ఇస్తే చాలు, భారత జట్టు తరుపున మరిన్ని మ్యాచులు ఆడితే చాలు... అంతకుమించి పెద్ద టార్గెట్లేమీ పెట్టుకోలేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్...

88

టీమిండియా తరుపున 52 టెస్టులు ఆడిన ఉమేశ్ యాదవ్, 158 వికెట్లు తీశాడు. 75 వన్డేలు, 7 టీ20 మ్యాచులు ఆడిన ఉమేశ్ యాదవ్, 115 వికెట్లు పడగొట్టాడు... 

click me!

Recommended Stories