వాళ్లిద్దరి వయసైపోయింది! పక్కనబెట్టి మంచి పని చేశారు... టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్..

Published : Jun 06, 2022, 01:41 PM IST

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన ఆఖరి నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో సీనియర్లు అజింకా రహానే, ఇషాంత్ శర్మ చోటు దక్కించుకోలేకపోయారు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు దక్కించుకోలేని ఈ ఇద్దరూ, తిరిగి చోటు దక్కించుకోలేకపోవడంతో రీఎంట్రీ దారులు మూసుకుపోయినట్టే అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

PREV
17
వాళ్లిద్దరి వయసైపోయింది! పక్కనబెట్టి మంచి పని చేశారు... టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్..

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో అమ్ముడుపోని ఇషాంత్ శర్మతో పాటు భారత టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానేకి కూడా ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో చోటు దక్కలేదు... ప్రసిద్ధ్ కృష్ణ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి వంటి యంగ్ ప్లేయర్లకు చోటు ఇచ్చిన సెలక్టర్లు, సీనియర్లను పక్కనబెట్టేశారు...  

27
Ajinkya Rahane

అజింకా రహానే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆడినా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అదీకాకుండా సీజన్ మధ్యలోనే గాయపడి, జట్టుకి దూరమయ్యాడు. రహానేని భారత జట్టుకి తిరిగి ఎంపిక చేయకపోవడానికి అతని గాయం కూడా ఓ కారణం...

37
Ishant Sharma, Virat Kohli

అజింకా రహానే, ఇషాంత్ శర్మలను టెస్టు టీమ్‌కి ఎంపిక చేయకుండా మంచిపని చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్... 

47
Ishant Sharma

‘ఇషాంత్ శర్మ వయసు అయిపోయింది. తరుచూ గాయపడుతున్నాడు. అతనికి తిరిగి అవకాశం ఇవ్వడం కంటే యంగ్ బౌలర్లకు అవకాశం ఇవ్వడమే సరైన నిర్ణయం అవుతుంది...

57

శ్రేయాస్ అయ్యర్ టెస్టుల్లో కూడా అద్భుతంగా రాణించగలనని నిరూపించుకున్నాడు. అతను విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేస్తే, భవిష్యత్తులో సక్సెస్‌ఫుల్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా మారుతాడు...

67

బుమ్రా, షమీ కలిసి బౌలింగ్ చేస్తే ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బందిపెట్టగలరు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్...

77
Image credit: Getty

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మలను తప్పించిన సెలక్టర్లు, వీరిలో పూజారాకి మాత్రమే తిరిగి జట్టులో చోటు కల్పించారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టి, నాలుగు సెంచరీలతో ఫామ్ చాటుకుని రీఎంట్రీ ఇచ్చాడు పూజారా... 

click me!

Recommended Stories