మనోళ్లు పూర్తి జట్టుతో చివరిగా ఆడిందెప్పుడయ్యా... టీమిండియా గాయాలపై వసీం జాఫర్ ట్వీట్ వైరల్...

First Published Dec 9, 2022, 4:14 PM IST

కెప్టెన్‌ని మారిస్తే టీమిండియా రాత మారుతుందని అనుకుంటే, గీత మారిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ టైటిల్స్ గెలవకపోయినా ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని ఆధిపత్యం చూపించింది భారత జట్టు. కెప్టెన్‌ని మార్చిన తర్వాత జట్టులో పూర్తిగా నిలకడ లోపించింది...

team india

ఏడాది గ్యాప్‌లో టీమిండియాకి 8 మంది కెప్టెన్లు మారారు. రోహిత్ ఫిట్‌నెస్ సమస్యలతో నిత్యం జట్టుకి దూరమవుతుండడంతో పాటు ప్లేయర్లు కూడా గాయపడుతూ వరుసగా సిరీస్‌లకు దూరంగా ఉంటున్నారు...

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, ఇప్పటిదాకా రీఎంట్రీ ఇవ్వలేదు. ఆసియా కప్‌లో రెండు మ్యాచులు ఆడి గాయంతో తప్పుకున్న రవీంద్ర జడేజా, భార్యను ఎమ్మెల్యే చేసే పనిలో ఉండి.. టీమ్‌కి దూరమవుతూ వచ్చాడు...

team india

మహ్మద్ షమీ, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందే గాయంతో టీమ్‌కి దూరం కాగా దీపక్ చాహార్ కూడా రెండో వన్డేలో గాయపడి దూరమయ్యాడు. గాయాలకు తోడు వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో ప్లేయర్లకు రెస్ట్ ఇస్తూ వస్తోంది టీమిండియా...

Image credit: Getty

న్యూజిలాండ్ టూర్ నుంచి కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోగా... బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ నుంచి హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ రెస్ట్ తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ కూడా టీమ్‌కి అందుబాటులో లేరు...

jadeja

బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో గాయపడిన రోహిత్ శర్మ టీమ్‌కి దూరమైన తర్వాత భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ దీని గురించే ట్వీట్ చేశాడు. ‘టీమిండయా పూర్తి స్ట్రెంగ్త్‌తో ఆఖరిగా ఎప్పుడు ఆడిందో గుర్తుందా? ఏ ప్లేయర్ గాయంతో తప్పుకోకుండా, ఎవ్వరికీ రెస్ట్ ఇవ్వకుండా...’ అంటూ ట్వీట్ చేశాడు వసీం జాఫర్...

ఆశ్చర్యకరంగా టీమిండియా పూర్తి ప్లేయర్లతో బరిలో దిగిన ఆఖరి సిరీస్ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీయే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన ఆఖరి సిరీస్‌లో భువీ, బుమ్రా, షమీతో పాటు రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు అందరూ పాల్గొన్నారు...

యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. ఇది మినహా హార్ధిక్ పాండ్యాతో పాటు టీమిండియాకి ఎంపికైన స్టార్ ప్లేయర్లు అందరూ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడారు. అయితే ఆ టోర్నీలో టీమిండియాకి అనుకున్న రిజల్ట్ రాలేదు...

తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓడి గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది. ఈ టోర్నీ తర్వాత విరాట్‌ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం, భారత క్రికెట్‌లో సంచలన మార్పులు తీసుకొచ్చింది... 

click me!