టీమిండియా పరువు కాపాడే బాధ్యత కెఎల్ రాహుల్ చేతుల్లో... ఆఖరి వన్డేలో ఓడితే ఇక ఆగమే...

First Published Dec 9, 2022, 3:26 PM IST

టీమిండియా ఐసీసీ టైటిల్ గెలిచి 9 ఏళ్లు కావస్తోంది. అయితే ద్వైపాక్షిక సిరీసుల్లో మాత్రం భారత జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విదేశాల్లో అద్వితీయ విజయాలు అందుకున్న భారత జట్టు, ఇప్పుడు స్వదేశీ పుల్లుల్లా మారిపోయింది...

స్వదేశంలో వరుసగా ద్వైపాక్షిక సిరీసులు గెలుస్తూ రికార్డులు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో కూడా వన్డే సిరీస్ కోల్పోయాడు. తొలి రెండు వన్డేల్లో ఓడిన టీమిండియా... కనీసం పరువు కాపాడుకోవాలంటూ మూడో వన్డేలో గెలిచి తీరాల్సిందే...

KL Rahul

బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్ ఓడిపోవడం టీమిండియాకి ఇది రెండో సారి. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో 2015 బంగ్లా పర్యటనకి వెళ్లినప్పుడు కూడా వన్డే సిరీస్‌ని కోల్పోయింది. మళ్లీ ఏడేళ్లకు ఇదే సీన్ రిపీట్ అయ్యింది...

kl rahul

మహీ కెప్టెన్సీలో తొలి రెండు వన్డేల్లో ఓడినా మూడో వన్డేలో గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ని ముగించింది భారత జట్టు. ఇప్పుడు టీమిండియాకి ఇదే కావాలి. తొలి రెండు మ్యాచుల్లో ఓడినా.. ఆ పరాజయాన్ని మరిచిపోయి విజయంతో టెస్టు సిరీస్‌ని ఆరంభించాలి...

KL Rahul

ఆఖరి వన్డేలో టీమిండియా పరువు కాపాడే బాధ్యత కెఎల్ రాహుల్‌పైనే పెట్టింది బీసీసీఐ. రోహిత్ శర్మ గాయపడడంతో ఆఖరి వన్డేకి రాహుల్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో కోల్పోయిన రాహుల్‌కి ఇది అగ్ని పరీక్షే...

Image credit: PTI

టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకలతో మ్యాచులు ఓడిన తర్వాత ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌కి కెఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు.  ఆ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో గెలిచి పరువు కాపాడుకుంది...

Image credit: PTI

అయితే ఆసియా కప్‌లో జరిగిన మ్యాచ్‌ టీ20 ఫార్మాట్... అదీకాకుండా ఆఫ్ఘాన్‌, టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో గెలవాలనే కసితో ఆడింది లేదు. ఆఫ్ఘాన్‌ని ఓడించడం కోసం టీమిండియా కష్టపడిన సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో లేవు...

KL Rahul

బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌పై మ్యాచులు గెలవాలంటే జట్టు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాలని మొదటి రెండు మ్యాచుల్లో అర్థమైంది. టీమ్‌ కలిసి కట్టుగా ఆడుతున్నట్టు కనిపించడం లేదు.

Rohit Sharma and KL Rahul

తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేయడం తప్ప రాహుల్ కూడా ఫామ్‌లో లేడు. ఇన్ని సమస్యలతో రాహుల్, టీమిండియా పరువు కాపాడగలడా... మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఆఖరి వన్డేలో టీమిండియా ఓడితే, కెఎల్ రాహుల్‌... టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే అవుతుంది... 

click me!