విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేయాలంటే అదొక్కటే మార్గం... ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కామెంట్...

Published : Jan 29, 2023, 12:00 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్, శ్రీలంకలపై వన్డే సెంచరీలు బాదాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ సెంచరీ బాది మూడేళ్లు దాటిపోయింది..

PREV
15
విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేయాలంటే అదొక్కటే మార్గం... ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కామెంట్...

వన్డేల్లో నాలుగు మ్యాచుల గ్యాప్‌లో మూడు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, వచ్చే నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలకంగా మారబోతున్నాడు... ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 7 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ... ఈసారి కూడా అదే రేంజ్‌లో అదరగొట్టాలని ఆశిస్తున్నారు అభిమానులు...

25

‘ఇండియా- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ వర్సెస్ ప్యాట్ కమ్మిన్స్‌ ఫైట్ చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుంది. ఈ సారి ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి. విరాట్ కోహ్లీని తక్కువ స్కోరుకే అవుట్ చేయాలంటే ప్యాట్ కమ్మిన్స్‌ బౌలింగ్‌కి రావాలి...
 

35

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి రాగానే కమ్మిన్స్‌ బౌలింగ్‌కి వస్తే ఈ ఇద్దరి మధ్య మంచి ఫైట్ చూడొచ్చు. ఇద్దరు టాప్ క్రికెటర్లు ఆధిపత్యం కోసం తలబడుతుంటే చూడడం కంటే మజా ఏముంటుంది...  
 

45

ఇండియాలో టెస్టు సిరీస్ గెలవాలంటే ఆస్ట్రేలియాకి ఇదే అద్భుత అవకాశం. మిచెల్ స్టార్క్, ఇండియా టూర్‌లో చాలా కీలక బౌలర్. అతనికి భారత్‌లో ఆడిన అనుభవం చాలా ఉంది. అది ఆస్ట్రేలియాకి బాగా ఉపయోగపడుతుంది...

55
Image credit: Getty

అయితే జోష్ హజల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్ ఇద్దరూ కూడా భారత్‌లో పరిస్థితులను చక్కగా వాడుకోగలరు. కామెరూన్ గ్రీన్ కూడా భారత బ్యాటర్లను ఇబ్బందిపెట్టగలడు. భారత బౌలర్లను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కోగలరో కూడా చూడాలని ఎదురుచూస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ జాసన్ గల్లెస్పీ.. 

Read more Photos on
click me!

Recommended Stories