హార్ధిక్ పాండ్యాకి ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదు! ధోనీ చేసిన పని మరిచిపోయాడా... - ఆకాశ్ చోప్రా

First Published Jan 29, 2023, 11:03 AM IST

విజయాలు వస్తున్నంతకాలం ఏం చేసినా చెల్లుతుంది. అయితే ఒక్క పరాజయం వస్తే చాలు, అంతా తారుమారు అయిపోతుంది. చేసిన ప్రతీ దాంట్లో తప్పులు వెతకడం మొదలెడతారు విమర్శకులు. ఇప్పుడు హార్ధిక్ పాండ్యా ఇలాంటి పొజిషన్‌లోనే పడ్డాడు...

వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ని క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు. అయితే హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో జరిగిన తొలి టీ20లో మాత్రం టీమిండియాకి ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హార్ధిక్ పాండ్యాకి ఇది ఊహించని షాకే...

Image credit: PTI

అంతకుముందు శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఓడినా అది నో బాల్స్ కారణంగా జరిగిందని, హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీని తప్పుబట్టలేదు విమర్శకులు. అయితే ఈసారి మాత్రం విజయానికి 21 పరుగుల దూరంలో నిలిచి, అన్ని విభాగాల్లో ఫెయిల్ అయింది భారత జట్టు...

Image credit: PTI

స్పిన్‌కి సహకరిస్తున్న పిచ్‌లో దీపక్ హుడాతో 2 ఓవర్లు మాత్రమే వేయించడం, ఉమ్రాన్ మాలిక్‌కి ఒకే ఓవర్ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, శివమ్ మావికి రెండే ఓవర్లు వేయించడం తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది...

Image credit: PTI

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా, హార్ధిక్ పాండ్యా స్ట్రాటెజీని తప్పుబట్టాడు. టీమ్‌లో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి వంటి స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నా, హార్ధిక్ పాండ్యా తొలి ఓవర్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు ఆకాశ్ చోప్రా...

Image credit: PTI

‘ఫిన్ ఆలెన్‌ ఫామ్‌లో లేడు. సరైన బౌలర్‌ని దింపితే అతను ఫస్ట్ ఓవర్‌లోనే అవుట్ అయ్యేవాడు. అర్ష్‌దీప్ సింగ్ ఉండగా హార్ధిక్ పాండ్యా మొదటి ఓవర్ ఎందుకు వేశాడు? పాండ్యా బౌలింగ్‌లో మొదటి ఓవర్‌లోనే 3 ఫోర్లు బాదాడు ఆలెన్..
 

Image credit: PTI

ఆ మూడు ఫోర్లు అతని కాన్ఫిడెన్స్‌ని రెట్టింపు చేసి ఉంటాయి. అందుకే ఆ తర్వాతి ఓవర్లలో ఫ్రీగా బ్యాటింగ్ చేశాడు. అదే తొలి ఓవర్‌లో కరెక్ట్ బౌలర్‌ని ప్రయోగించి, అతని వికెట్ తీసి ఉంటే న్యూజిలాండ్ జట్టును 150లోపే పరిమితం చేసే అవకాశం దొరికేది..

Image credit: PTI

బౌలర్లను మార్చిన విధానం నాకు వింతగా అనిపించింది. శివమ్ మావిని చాలా ఆలస్యంగా తీసుకొచ్చాడు. అందరూ అయిపోయాక అతనికి బౌలింగ్ ఇచ్చాడు. టీమ్‌లో ఎంత మంది బౌలర్లు ఉన్నారు, ఎవరు ఎలా బౌలింగ్ చేస్తారనే విషయాలపై పాండ్యా ఫోకస్ పెట్టాలి...
 

Washington Sundar

అంతా నేనే చేయాలి, నేను మాత్రం కరెక్టుగా వేయగలను.. అనే ఆలోచన కెప్టెన్‌కి ఉండడం కరెక్ట్ కాదు. హార్ధిక్ పాండ్యా 3 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్నాడు..

నిజానికి సుందర్‌లా మరో ప్లేయర్ ఆడి ఉంటే, టీమిండియా గెలిచి ఉండేది. అర్ష్‌దీప్ సింగ్ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి సమయాల్లో అతనికి ఆఖరి ఓవర్ ఇవ్వడం కంటే ఉమ్రాన్ మాలిక్‌కి ఇచ్చి ఉంటే బాగుండేది. 

Washington Sundar

ఒక్క ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చాడని అతనికి మరో ఓవర్ ఇవ్వకపోవడం ఎంత వరకూ కరెక్ట్.. హార్ధిక్ పాండ్యా తన మొదటి మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చిన తర్వాత కూడా ధోనీ, అతనికి మళ్లీ బౌలింగ్ ఇచ్చాడు. హార్ధిక్ ఈ విషయాన్ని మరిచిపోతే ఎలా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా... 

click me!