రోహిత్‌ శర్మని పట్టించుకోని ఆస్ట్రేలియా! టెస్టు సిరీస్ పోస్టర్‌లో ప్యాట్ కమ్మిన్స్‌తో విరాట్ కోహ్లీ...

First Published Jan 29, 2023, 10:20 AM IST

గత ఏడాది జనవరిలో సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్ టెస్టు ముగిసిన తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ... అయితే ఇప్పటికీ టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు... ముఖ్యంగా ఆస్ట్రేలియాలో విరాట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..
 

టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్లలో ఒకడిగా రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ, ఈజీగా టాప్ 2లోకి వెళ్లే అవకాశం ఉన్నా, బీసీసీఐతో విభేదాలతో సారథ్య బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు...

అయితే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని టీ20 వరల్డ్ కప్ 2022 సమయంలో విరాట్ కోహ్లీ ఫోటోనే ప్రచురించింది ఐసీసీ... ఐసీసీ వెబ్‌సైట్‌లో విరాట్ కోహ్లీ ప్లేస్‌లో రోహిత్ శర్మ ఫోటో రావడానికి చాలా సమయమే పట్టింది...
 

తాజాగా మరోసారి రోహిత్ శర్మకు అవమానం జరిగింది... బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించనుంది... ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే ఈ టెస్టు సిరీస్ కోసం ఆసీస్ జట్టు, ఫిబ్రవరి 1న ఇండియాలో అడుగుపెట్టనుంది...

తాజాగా ఈ టెస్టు సిరీస్‌కి సంబంధించిన ప్రోమోని, పోస్టర్‌ని విడుదల చేసింది ఫాక్స్ క్రికెట్ ఛానెల్. అయితే ఈ పోస్టర్‌లో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు విరాట్ కోహ్లీ ఉండడం విశేషం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పూర్తిగా విస్మరించింది ఆస్ట్రేలియా బ్రాడ్‌కాస్టర్...

భారత్‌లో టెస్టు సిరీస్‌ని ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మాత్రం రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్‌లను పోస్టర్‌లో చూపించింది. అయితే ఈ పోస్టర్ కోసం రోహిత్ శర్మ, వెస్టిండీస్‌పై చేసిన టెస్టు సెంచరీ ఫోటోని వాడడం విశేషం..

రోహిత్ శర్మ టెస్టుల్లో చేసిందే 8 సెంచరీలు. అది కూడా సౌతాఫ్రికాపై 3, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ జట్లపై రెండేసి, శ్రీలంకపై ఓ సెంచరీ చేశాడు రోహిత్... వీటిలో 7 సెంచరీలు స్వదేశంలో వచ్చినవే. 2021లో ఇంగ్లాండ్‌లో మొట్టమొదటి విదేశీ టెస్టు సెంచరీ అందుకున్నాడు రోహిత్ శర్మ...

ఆస్ట్రేలియాపై ఇప్పటిదాకా ఒక్కటెస్టు సెంచరీ కూడా చేయలేకపోయాడు రోహిత్ శర్మ... వన్డే ఫార్మాట్‌లో ఆసీస్‌పై 8 సెంచరీలు బాదాడు రోహిత్. దీంతో రోహిత్‌ని కాకుండా విరాట్ కోహ్లీ ఫోటోని టెస్టు సిరీస్ కోసం వాడింది ఫాక్స్ క్రికెట్ ఛానెల్...

ఇదే సమయంలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. 6 టెస్టుల్లో 918 పరుగులు చేసి ఆసీస్‌కి ముచ్ఛెమటలు పట్టించాడు... అందుకే రోహిత్ స్థానంలో కోహ్లీనే వాడడమే సరైన నిర్ణయంగా చెబుతున్నారు విరాట్ ఫ్యాన్స్...

click me!