2011 వన్డే వరల్డ్‌కప్‌లో సడెన్‌గా బ్యాటుకున్న ప్లాస్టర్లు తీసేసిన సచిన్ టెండూల్కర్... ఎందుకని అడిగితే...

First Published Jun 4, 2023, 6:09 PM IST

24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఆరు వన్డే వరల్డ్ కప్స్ ఆడిన సచిన్ టెండూల్కర్‌, ప్రపంచ కప్ కల 2011 వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో నెరవేరింది. సచిన్ టెండూల్కర్ ప్రతీ చిన్న విషయంలో ఎంత కేర్ తీసుకునేవాడో ఓ కార్యక్రమంలో బయటపెట్టాడు స్టార్ కామెంటేటర్ హర్షా భోగ్లే..

2003 వన్డే వరల్డ్ కప్‌లో 11 మ్యాచుల్లో 61.18 స్ట్రైయిక్ రేటుతో 673 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, ఒకే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 

2011 వన్డే వరల్డ్ కప్‌లో 482 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో 4 పరుగులు చేసి అవుటైన సచిన్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

sachin tendular

‘సచిన్ టెండూల్కర్ తరుచుగా బ్యాట్లను మార్చేవాడు కాదు. అందరిలాగే బ్యాటుకి ప్లాస్టర్ల మీద ప్లాస్టర్లు పెట్టేవాడు. 2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా సచిన్ ఇలాంటి బ్యాటుతోనే బ్యాటింగ్ చేశాడు. ఓ మ్యాచ్‌లో సడెన్‌గా ప్లాస్టర్లు లేని సాదా బ్యాటుతో బ్యాటింగ్‌కి వచ్చాడు..

Sachin Tendulkar

నేను ఆ విషయాన్ని గమనించాను. మ్యాచ్ తర్వాత ఎందుకుని బ్యాటుకి ఉన్న ప్లాస్టర్లను తీసేశారని అడిగాను. దానికి సచిన్ చెప్పిన సమాధానం ఎప్పటికీ మరిచిపోలేను...

Sachin Tendulkar

‘‘ఏం లేదు, గత మ్యాచ్‌లో నేను ఓ కవర్ డ్రైవ్ ఆడాను. కవర్స్‌లో ఉన్న ఫీల్డర్‌కి గజం దూరం పడి ఉంటే అది కచ్ఛితంగా ఫోర్ పోయి ఉండేది. కానీ ఫీల్డర్ దాన్ని ఆపేశారు. అప్పుడే నా బ్యాటు మార్చాల్సిన అవసరం వచ్చిందని అర్థమైంది... అందుకే మార్చా’’ అన్నారు...

Sachin Tendulkar

క్రికెట్‌లో ప్రతీ చిన్న విషయంపై సచిన్ టెండూల్కర్‌కి ఎంతటి అవగాహన ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు...

బ్యాటుకి ఉన్న ప్లాస్టర్స్ కారణంగా కవర్ డ్రైవ్ వెళ్లాల్సిన బాల్, ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందనే చిన్న విషయాన్ని కూడా సచిన్ గుర్తించారు, మళ్లీ ఆ తప్పు జరగకుండా బ్యాటు మార్చేశారు...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్షా భోగ్లే.. 

click me!