మహేంద్ర సింగ్ ధోనీ లేకపోతే సీఎస్‌కే టీమ్, శవంతో సమానం... ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్...

First Published Jun 4, 2023, 4:25 PM IST

ఐపీఎల్ 2008 నుంచి 2023 సీజన్‌ వరకూ కెప్టెన్‌గా కొనసాగుతున్న ఒకే ఒక్కడు మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఐదో టైటిల్ అందించిన మాహీ, వచ్చే సీజన్‌లో ఆడతాడో ఆడడో అనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు...

Image credit: PTI

మహేంద్ర సింగ్ ధోనీ ఆడకపోతే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏంటి? ఈ సీజన్‌లో సీఎస్‌కే ఎక్కడ ఆడినా మాహీని చూసేందుకు జనాలు పోటెత్తారు. స్టేడియమంతా సీఎస్‌కే ఫ్యాన్స్‌తో పసుపు వర్ణంతో నిండిపోయింది... మాహీ రిటైర్ అయితే ఈ ఫాలోయింగ్ ఇలాగే ఉంటుందా?

Image credit: PTI

‘ఐపీఎల్ 2022 సీజన్‌లో ధోనీని రిటైన్ చేసుకుంటారని అనుకోలేదు. ఎందుకంటే మూడు సీజన్లు కూడా ఆడతాడో లేదో తెలియని ప్లేయర్‌ని రిటైన్ చేసుకునే కంటే వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వొచ్చు. అయితే ధోనీ లేకపోతే సీఎస్‌కే, ప్రాణం లేని శవం లాంటిదే...
 

మాహీ రిటైర్ అయ్యాక చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇలాంటి ఆదరణ దక్కుతుందని మాత్రం నేను అనుకోవడం లేదు. ధోనీ ప్లేస్‌లో వచ్చే కెప్టెన్ కూడా చాలా ఒత్తిడిని మోయాల్సి ఉంటుంది. మాహీ నడిపించిన టీమ్‌ని నడిపించడం అంత తేలికైన విషయం కాదు...
 

Image credit: PTI

గత సీజన్‌లో జడేజా రూపంలో అందరికీ ఈ విషయం అర్థమైంది. అతను మళ్లీ కెప్టెన్సీ జోలికి పోడు. ధోనీ ఇంకో ఏడాది ఆడతాడనే అనుకుంటున్నా...

మాహీకి ఇదే లాస్ట్ సీజన్ అని చాలా ప్రచారం జరిగింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ రెండు, మూడేళ్ల కోసం మాహీని రిటైన్ చేసుకుందని నేను అనుకోవడం లేదు...
 

Image credit: PTI

రవీంద్ర జడేజా కూడా ఆడినంత కాలం చెన్నై సూపర్ కింగ్స్‌లోనే కొనసాగుతాడు. తానంతట తాను వేరే టీమ్‌కి వెళ్లాలని అనుకుంటే తప్ప, జడ్డూ కూడా సీఎస్‌కే నుంచి వేరుపడలేడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

click me!