అర్జున్ టెండూల్కర్ ఫ్యూచర్ ఏంటి? ఆ ఇద్దరూ వస్తే మళ్లీ రిజర్వు బెంచ్‌‌కేనా... 2023లో అట్టర్ ఫ్లాప్ కావడంతో...

Published : Jun 04, 2023, 04:55 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆరంగ్రేటం చేసిన ప్లేయర్లలో అర్జున్ టెండూల్కర్ ఒకడు. సచిన్ టెండూల్కర్ కొడుకుని మొదటిసారి ఐపీఎల్ 2021 వేలంలో కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్, రెండు సీజన్ల పాటు రిజర్వు బెంచ్‌లోనే కూర్చోబెట్టింది...

PREV
18
అర్జున్ టెండూల్కర్ ఫ్యూచర్ ఏంటి? ఆ ఇద్దరూ వస్తే మళ్లీ రిజర్వు బెంచ్‌‌కేనా... 2023లో అట్టర్ ఫ్లాప్ కావడంతో...

జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ టీమ్‌కి దూరం కావడంతో ఎట్టకేలకు బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ 2023 సీజన్ ఆడేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో 4 మ్యాచులు ఆడిన అర్జున్ టెండూల్కర్, 3 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క సారి బ్యాటింగ్‌కి వచ్చి 13 పరుగులు చేశాడు..

28

అర్జున్ టెండూల్కర్‌కి తుది జట్టులో చోటు దక్కిన నాలుగింట్లో రెండు మ్యాచుల్లో అతనితో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేయించాడు రోహిత్ శర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సిన సమయంలో అర్జున్‌కి బాల్ అందించాడు రోహిత్ శర్మ..

38
Arjun Tendulkar

ఆ మ్యాచ్‌లో మొట్టమొదటి ఐపీఎల్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చి ఏకంగా 31 పరుగులు ఇచ్చేశాడు. దెబ్బకు అర్జున్ టెండూల్కర్‌తో మళ్లీ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించే సాహసం చేయలేదు రోహిత్ శర్మ..

48
Image credit: PTI

‘నేను క్రికెటర్‌ కావాలని అనుకున్నాక నా కుటుంబం నుంచి పూర్తి మద్ధతు లభించింది. మా అమ్మ ఎల్‌ఐసీలో పనిచేసేది, మా నాన్న ప్రొఫెసర్. మా అన్న అజిత్ టెండూల్కర్, ప్రతీ సమస్యకి పరిష్కారాలు కనుక్కోవడంలో దిట్ట. ఇంకో అన్న నితిన్ టెండూల్కర్ చాలా మంచి పెయింటర్...
 

58
Image credit: PTI

వాళ్లంతా కలిసి నాకు ఎంతో సహకరించారు. ప్రతీ కుటుంబం నుంచి బిడ్డ ఆసక్తిని గమనించి, అందులో రాణించేలా ప్రోత్సహించాలి. నా రిటైర్మెంట్ తర్వాత అర్జున్ టెండూల్కర్‌పైన అందరి ఫోకస్ పడింది. అయితే వాడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని మీడియాని కోరాను..
 

68
Arjun Tendulkar-Sachin Tendulkar

అర్జున్‌కి క్రికెట్‌ అంటే ఇష్టం, ప్రేమ రెండూ ఉన్నాయి. నాకు నా కుటుంబం ఎలాంటి స్వేచ్ఛ ఇచ్చిందో అర్జున్‌కి నేను అంతే స్వేచ్ఛని ఇచ్చాను. వాడి సక్సెస్‌ వాడి చేతుల్లోనే ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు సచిన్ టెండూల్కర్...

78

అర్జున్ టెండూల్కర్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ వంటి టీమ్స్‌లో ఉండి ఉంటే, సచిన్ కొడుకు అయినందుకైనా వరుస అవకాశాలు దక్కించుకునేవాడు. కానీ ముంబై ఇండియన్స్‌లో పరిస్థితి అలా ఉండదు...

88
Image credit: PTI

జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఈ బేస్ ప్రైజ్ బౌలర్లు అందరూ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే. మరి ఆడిన మ్యాచుల్లో తన మార్కు చూపించలేకపోయిన అర్జున్ టెండూల్కర్ భవిష్యత్ ఏంటి? అనేది వచ్చే సీజన్‌లో తేలిపోనుంది.. 

click me!

Recommended Stories