సెంచరీ, హాఫ్ సెంచరీ కాదు... కేవలం సింగిల్ తీసి బ్యాటుతో అభివాదం చేసిన రాహుల్ ద్రావిడ్...

First Published May 24, 2021, 2:58 PM IST

క్రికెట్‌లో హాఫ్ సెంచరీ లేదా సెంచరీ మార్కు అందుకున్న తర్వాత బ్యాటు ఎత్తి అభివాదం చేసుకుంటున్నారు బ్యాట్స్‌మెన్. క్రికెట్‌లో ఒక్కో క్రికెటర్‌కి ఒక్కో రకమైన సెలబ్రేషన్స్‌ స్టైల్స్ ఉంటాయి. అయితే భారత మాజీ సారథి, ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ ఓ మ్యాచ్‌లో కేవలం సింగిల్ తీసి బ్యాటు ఎత్తి సెలబ్రేట్ చేసుకున్నారంటే నమ్ముతారా...

వరల్డ్ క్రికెట్‌లోనే రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ స్టైల్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే రాహుల్ ద్రావిడ్, కొన్ని మ్యాచుల్లో జిడ్డు బ్యాటింగ్‌తో వికెట్లకి అడ్డుగోడలా నిలబడేవాడు.
undefined
వన్డేల్లో 13,288 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, వన్డేల్లో 10889 పరుగులు చేశాడు. వన్డేలు, టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్లలో సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానం రాహుల్ ద్రావిడ్‌దే.
undefined
రాహుల్ ద్రావిడ్ క్రీజులోకి వచ్చాడంటే బౌలర్ల సహనానికి పరీక్ష మొదలైనట్టే. తన జిడ్డు బ్యాటింగ్‌తో ఓవర్లకు ఓవర్లు మింగేసే రాహుల్ ద్రావిడ్, కొన్నిసార్లు ఖాతా తెరవడానికి 30-40 బంతులను ఈజీగా ఆడేసేవాడు...
undefined
2008 ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీలో రెండో టెస్టు ఆడింది టీమిండియా. వసీం జాఫర్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ ద్రావిడ్ మిచెల్ జాన్సర్ వేసిన ఓవర్‌లో తాను ఎదుర్కొన్న ఏడో బంతికే బౌండరీ బాది ఖాతా తెరిచాడు.
undefined
అలా 58 బంతుల్లో 18 పరుగులు చేసిన తర్వాత రాహుల్ ద్రావిడ్... తన డిఫెన్సివ్ ఆటతీరుకి తెరతీశాడు. ఆండ్రూ సైమండ్స్, బ్రెట్‌లీ, స్టువర్ట్ క్లార్క్... ఇలా 39 బంతులు డాట్ బాల్స్‌గా ఆడాడు. దీంతో సిడ్నీ ప్రజలు, ద్రావిడ్ ఆటతీరుకు తీవ్రంగా స్పందించారు.
undefined
ద్రావిడ్ ఆడే ఒక్కో డాట్ బాల్‌కి... ‘ఓ....’ అంటూ అరుస్తూ, చప్పట్లు కొడుతూ హేళన చేయడం మొదలెట్టారు. అయితే వారి వెటకారానికి తన హుందాతనంతో చక్కని సమాధానం ఇచ్చాడు రాహుల్ ద్రావిడ్.
undefined
39 బంతుల తర్వాత క్లార్క్ బాలింగ్‌లో సింగిల్ తీసిన రాహుల్ ద్రావిడ్, బ్యాటు పైకెత్తి అభివాదం చేశాడు. ఈ రియాక్షన్‌తో షాక్ అయిన సిడ్నీ జనాలు, అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిల్చుని అభివాదం తెలపడం విశేషం.
undefined
ఇదే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 154 పరుగులు, వీవీఎస్ లక్ష్మణ్ 109 పరుగులతో రాణించగా రాహుల్ ద్రావిడ్ 160 బంతుల్లో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 103 బంతుల్లో 38 పరుగులు చేశాడు రాహుల్ ద్రావిడ్. అయితే టీమిండియాకి విజయాన్ని అందించలేకపోయాడు.
undefined
దురుసు ప్రవర్తనకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన సిడ్నీ జనాలు, ఈ సంఘటన జరిగిన 12 ఏళ్ల తర్వాత కూడా భారత క్రికెటర్లపై ఇదే విధంగా ప్రవర్తించడం విశేషం. 2020 ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మూడో టెస్టులో మహ్మద్ సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
undefined
click me!