ఏబీ డివిల్లియర్స్ జట్టులో లేకపోతే వాళ్లకి కష్టమే, కనీసం గ్రూప్ స్టేజ్ కూడా... -మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

First Published May 24, 2021, 12:30 PM IST

ఏబీ డివిల్లియర్స్... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఓ సూపర్ స్టార్ క్రికెటర్. మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ, కొన్నాళ్ల కిందట రీఎంట్రీ ఇస్తున్నట్టు ఆశలు రేపి, అంతలోనే అంతా తూచ్ అంటూ తేల్చేశాడు...

ఏబీడీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని భావిస్తే, అతని కోసం తలుపులు తెరిచే ఉన్నాయని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బ్రౌచర్ ప్రకటించగా, విండీస్ టూర్‌లో ఏబీడీ స్థానం కల్పిస్తూ జట్టును ప్రకటించాడు సఫారీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్...
undefined
అయితే రిటైర్మెంట్ విషయంలో ఓసారి నిర్ణయం తీసుకున్నానని, అదే ఫైనల్ అంటూ తేల్చేసిన ఏబీ డివిల్లియర్స్... తన కోసం ఓ యువకుడిని జట్టుకి దూరం చేయడం ఇష్టలేదని కమ్‌బ్యాక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే..
undefined

Latest Videos


మిగిలిన టోర్నీల్లో ఎలా ఆడినా ఐసీసీ టోర్నీల్లో మోస్ట్ అన్‌లక్కీ జట్టుగా పేరొందింది దక్షిణాఫ్రికా. గ్రేమ్ స్మిత్, ఏబీడీ వంటి స్టార్లతో నిండిన సమయంలో కూడా వరల్డ్‌కప్ 1999, 2015ల్లో నాకౌట్‌ స్టేజ్‌కూడా దాటలేకపోయింది దక్షిణాఫ్రికా...
undefined
‘ఏబీ డివిల్లియర్స్ రీఎంట్రీ ఇచ్చి ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా జట్టు కూడా మంచి పటిష్టమైన జట్లలో ఒకటిగా ఉండేది. కానీ ఇప్పుడు అతను రీఎంట్రీ ఇవ్వడం లేదని తేలిపోయింది.
undefined
ఏబీడీ లాంటి క్వాలిటీ ప్లేయర్‌ను తీసుకురావడం అసాధ్యం. దక్షిణాఫ్రికా జట్టులో మంచి ప్లేయర్లు ఉన్నారు, కానీ వారికి వరల్డ్‌కప్ గెలిచేంత సత్తా అయితే లేదని నా అభిప్రాయం...
undefined
దక్షిణాఫ్రికాలో ఎంత మంది మంచి ప్లేయర్లు ఉన్నా వాళ్లు ఎవ్వరూ ఏబీడీలా మ్యాచ్ విన్నర్లు కాదు. నా అభిప్రాయం ప్రకారం వాళ్లు అంచనాలకు తగినట్టుగా ఆడినా కొన్ని విజయాలు సాధించి, కొన్ని జట్లను ఇబ్బందులకు గురిచేయగలరు అంతే...
undefined
అంతేకానీ వరల్డ్‌కప్ ఇండియాలో జరిగినా, యూఏఈలో జరిగినా టోర్నీ గెలిచేంత సామర్థ్యం ఉన్న ప్లయర్లు మాత్రం నాకు దక్షిణాఫ్రికా టీమ్‌లో కనిపించడం లేదు. అందుకే వరల్డ్‌కప్‌లో వాళ్లు ఆడినా, ఫెవరెట్ టీమ్‌లలో సఫారీ టీమ్ ఉండదనే నా అభిప్రాయం... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
undefined
ఏబీడీ రీఎంట్రీ ఇవ్వడం లేదని ఖరారు కావడంతో డుప్లిసిస్, డి కాక్, రబాడా, నోకియా, ఇమ్రాన్ తాహీర్, క్రిస్ మోరిస్ వంటి స్టార్ ప్లేయర్లతో టీ20 వరల్డ్‌కప్‌లో బరిలో దిగాలని చూస్తోంది దక్షిణ్రాఫ్రికా క్రికెట్ జట్టు.
undefined
click me!