Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా సిరీస్ కోసం అక్కడ ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో మాట్లాడుతూ.. తన కెరీర్ లో గడ్డుకాలం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు గెలిచిన ఎన్నో మ్యాచులలో తాను ఉత్తమ ప్రదర్శన చేసినా.. ఒంటిచేత్తో తాను మ్యాచులను గెలిపించినా తనకు ఎవరూ మద్దతుగా నిలువలేదంటూ టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
210
అశ్విన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా లో ఉన్నాడు. త్వరలో జరుగబోయే మూడు మ్యాచుల సిరీస్ కోసం ప్రిపేర్ అవుతున్న అశ్విన్.. పలు విషయాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
310
అశ్విన్ మాట్లాడుతూ.. ‘2018-20 మధ్యకాలంలో నేను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిద్దామని అనుకున్నాను. నేనెంతగా ప్రయత్నం చేసినా నేన అనుకున్నది జరుగలేదు. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కకపోయేసరికి బాగా నిరాశకు గురయ్యాను. ఒక్కోసారి తీరిక లేని క్రికెట్ ఆడుతూ అలసిపోయి నాకు విరామం కావాలి అనిపించేది.
410
అదొక్కటే గాక చాలా కారణాల వల్ల నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించాను. ప్రజలు నా గాయాల పట్ల పెద్దగా పట్టించుకోలేదు. ఎంతో మంది ఆటగాళ్లకు ఏదైనా జరిగితే జట్టు సభ్యులు గానీ, ప్రజల నుంచి గానీ భారీ మద్దతు ఉంటుంది.
510
కానీ నాకు అలా జరుగలేదు. నాకు ఎవరూ మద్దతుగా నిలువలేదు. ఆ సమయంలో నేను చాలా కుంగిపోయేవాడిని. ఒక్కొక్కసారి.. వాళ్ల మద్దతును పొందడానికి నేను అర్హుడిని కాదా..? అని అనిపించేది.
610
జట్టు కోసం నేను చాలా గేమ్ లు ఆడాను. ఎన్నో మ్యాచులలో జట్టును గెలిపించాను. నేను సాధారణంగా సాయం కోసం చూడను. కానీ నాకు ఎవరైనా తోడుంటే బాగుండు అనిపించింది. కానీ అది జరుగలేదు.
710
2018 లో ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కావచ్చు.. ఆ సంవత్సరం తర్వాత మళ్లీ ఆసీస్ లో అడిలైడ్ టెస్టు తర్వాత కావచ్చు.. నేను నా జీవితంలో చాలా దశలను దాటివచ్చాను. ఆ సమయంలో నేను చాలా కుంగిపోయాను.
810
అప్పుడు నా భార్య నన్ను చాలా ప్రోత్సహించింది. ఆమె నాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నా భుజం తట్టింది. నా భార్యతో పాటు మా నాన్న కూడా నాకు ధైర్యం చెప్పేవాడు. ఎప్పటికైనా నువ్వు వైట్ బాల్ (పరిమిత ఓవర్ల క్రికెట్) ఆడతావని నన్ను ప్రోత్సహించేవాడు.. నేను చనిపోయే ముందే దానిని చూస్తానని చెప్పేవాడు...’ అని భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు.
910
2017లో గాయం కారణంగా టీ20ల నుంచి దూరమైన అశ్విన్.. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో స్థానం దక్కించుకున్నాడు. నాలుగేండ్ల తర్వాత పునరాగమనం చేసినా అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే న్యూజిలాండ్ సిరీస్ లో కూడా రాణించాడు.
1010
ఇక 2018 నుంచి 2020 మధ్య 18 టెస్టులాడిన అశ్విన్.. 24.26 సగటుతో 71 వికెట్లు తీశాడు. మొత్తమ్మీద అశ్విన్.. భారత్ తరఫున 81 టెస్టులాడి 427 వికెట్లు పడగొట్టాడు.