ధోనీ నువ్వు అవుట్, క్రీజు వదిలి వెళ్లిపో... మాహీతో గొడవపెట్టుకున్న లారా... ద్రావిడ్ ఏం చేశాడంటే..

First Published Jun 10, 2021, 6:07 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ, తన క్రికెట్ కెరీర్‌లో భారత జట్టుకి ఎన్నో విజయాలు అందించాడు. 2007లో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న ధోనీ, సారథ్య బాధ్యతలు తీసుకోకముందు దూకుడు చూపించేవాడు. విండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బ్రియాన్ లారా, మహేంద్ర సింగ్ ధోనీ మధ్య సంగ్వాదం జరిగింది...

2006లో భారత జట్టు, వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. సెయింట్స్ జోన్స్‌లో మొదటి టెస్టు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, విండీస్ బౌలర్ల ధాటికి 241 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ సమయంలో టీమిండియాకి కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ 49 పరుగులు చేయగా, సెహ్వాగ్ 36, లక్ష్మణ్ 29 పరుగులు చేశారు.
undefined
గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి సచిన్ టెండూల్కర్ దూరంగా ఉన్నారు. దీంతో వసీం జాఫర్‌కి ఓపెనర్‌గా అవకాశం దక్కగా, వీవీఎస్ లక్ష్మణ్ వన్‌డౌన్‌లో ద్రావిడ్ టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చారు...
undefined
లారా కెప్టెన్సీలోని విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగుల భారీ స్కోరు చేసింది... బ్రియాన్ లార్ 18 పరుగులకే అవుట్ అయినా క్రిస్ గేల్ 72, డ్వేన్ బ్రావో 68, రామ్‌నరేశ్ సర్వాన్ 58 పరుగులతో రాణించారు. మునాఫ్ పటేల్, అనిల్ కుంబ్లే మూడేసి వికెట్లు తీయగా, విరాట్ సింగ్, సెహ్వాగ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. విండీస్‌కి 130 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
undefined
అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. వసీం జాఫర్ 24 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 212 పరుగులు చేయగా సెహ్వాగ్ 41, లక్ష్మణ్ 31, రాహుల్ ద్రావిడ్ 62, యువరాజ్ సింగ్ 39, మహ్మద్ కైప్ 46, ధోనీ 69 ఇలా బ్యాటింగ్‌కి వచ్చిన అందరూ రాణించారు. దీంతో 521 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది టీమిండియా.
undefined
అయితే ధోనీ బ్యాటింగ్‌కి వచ్చిన తర్వాత కాసేపు హైడ్రామా నడిచింది. 52 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాదిన ఎమ్మెస్ ధోనీ, రెండుసార్లు హ్యాట్రిక్ సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. డేవ్ మహ్మమద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన ధోనీ, డారెన్ గంగాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
అయితే డారెన్ గంగా తీసుకున్న క్యాచ్‌పై అనుమానం రావడంతో ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశారు. టీవీ రిప్లైలో గంగా క్యాచ్ తీసుకుంటున్న సమయంలో అతని కాలు, బౌండరీ లైన్‌కి తాకుతుందా? లేదా? అనేది స్పష్టంగా కనిపించలేదు. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.
undefined
అయితే బ్రియాన్ లారా మాత్రం ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్యాచ్ అందుకున్న డారెన్ గంగా, అది క్లియర్ క్యాచ్ అని చెబుతున్నప్పుడు అవుట్ ఇవ్వకుండా ఎందుకు వదిలేస్తారంటూ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు...
undefined
అంపైర్లు వినిపించుకోకపోవడంతో మహేంద్ర సింగ్ ధోనీ వద్దకు వచ్చి, ‘నువ్వు అవుట్, క్రీజు నుంచి వెళ్లిపో’ అంటూ కాసేపు చర్చించాడు బ్రియాన్ లారా. ధోనీ మాత్రం అంపైర్లు అవుట్‌గా చెప్పకుండా ఎలా వెళ్తానంటూ సమాధానం ఇచ్చాడు. ఈ హైడ్రామాను పెవిలియన్ నుంచి గమనించిన భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ఆటను ఆపేసి రావాలని ‘డిక్లేర్’ చేస్తున్నట్టు ప్రకటించాడు...
undefined
మహేంద్ర సింగ్ ధోనీ ఉండాలా? వద్దా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోకముందే ద్రావిడ్, డిక్లేర్ చేయడంతో టెక్నికల్‌గా అతను మైదానం వీడినట్టు భావించి మాహీని అవుట్‌గా ప్రకటించారు అంపైర్లు...
undefined
రెండో ఇన్నింగ్స్‌లో బ్రియాన్ లారాను డకౌట్ చేశాడు శ్రీశాంత్. అయితే క్రిస్ గేల్ 69, చంద్రపాల్ 62 పరుగులతో రాణించగా డేవ్ మహ్మద్ 52 పరుగులు చేశాడు. 297 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయిన విండీస్, ఓడడం ఖాయమనుకున్న సమయంలో ఆఖరి వికెట్ పడకుండా 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఫిడెల్ ఎడ్వర్డ్స్, కోరీ కోల్లిమోర్ తమ జట్టుకి అద్భుతమైన డ్రాని అందించారు.
undefined
ఇలాంటి సంఘటనల కారణంగా ఐసీసీ, క్యాచ్ అందుకున్న ప్లేయర్ అభిప్రాయాన్ని కనుక్కొని అంపైర్లు ‘సాఫ్ట్ సిగ్నల్’ ప్రకటించే అవకాశాన్ని కల్పించింది. అయితే ఆసీస్ టూర్‌లో, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచుల్లోనూ సాఫ్ట్ సిగ్నల్‌పై కూడా దుమారం రేగింది.
undefined
సాఫ్ట్ సిగ్నల్ రూల్ కారణంగానే బంతి నేలను తాకుతున్నట్టు కనిపించినా.... రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్. అదే మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కొట్టిన షాట్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.
undefined
click me!