భారతీయుల యాసను అవమానిస్తూ ట్వీట్లు... ఆ ఇద్దరిపై చర్యలు తీసుకుంటామంటున్న కేకేఆర్...

First Published Jun 10, 2021, 5:15 PM IST

ఇంగ్లాండ్ క్రికెటర్ ఓల్లీ రాబిన్‌సన్ ట్వీట్ల బాగోతం తర్వాత క్రికెటర్ల పాత ట్వీట్లను తవ్వితీయడంలో చాలా బిజీ అయ్యారు నెటిజన్లు. ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెటర్లు జోస్ బట్లర్, డామ్ బేస్, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఈ ట్వీట్ల కారణంగా సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ లిస్టులోకి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కూడా చేరాడు.

ఓల్లీ రాబిన్‌సన్ వేసిన జాత్యాహంకార ట్వీట్లు వైరల్ కావడంతో అతన్ని మొదటి టెస్టు ముగిసిన తర్వాత జట్టు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఈ రకంగా ట్వీట్లు చేసిన వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపింది...
undefined
అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిస్థితి ఎలా ఉన్నా, భారత అభిమానులను దూషిస్తూ, చులకనగా మాట్లాడుతూ చేసిన ట్వీట్లు వైరల్ కావడంతో ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది...
undefined
భారతీయులు గౌరవప్రదంగా ఏదైనా మాట్లాడేముందు వాడే ‘సార్’ అనే పదాన్ని ట్రోల్ చేస్తూ బ్రెండన్ మెక్‌కల్లమ్, జోస్ బట్లర్, ఇయాన్ మోర్గాన్... సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌లో సంభాషించుకున్నారు. 2018లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు బయటికి వచ్చింది...
undefined
భారతీయ లీగ్ ఐపీఎల్ ద్వారా కోట్లకి కోట్లు సంపాదిస్తూ, భారతీయుల యాసను చులకనగా మాట్లాడడం ఏంటని నిలదీస్తున్నారు అభిమానులు. వెంటనే వీరిపై చర్యలు తీసుకోవాలని ఫ్రాంఛైజీలను కోరుతున్నారు...
undefined
ఓల్లీ రాబిన్‌సన్ సంఘటన తర్వాత ఇంగ్లాండ్ క్రికెటర్లు పాత ట్వీట్లను డిలీట్ చేసే పనిలో బిజీగా ఉన్నా, ఈ పాత ట్వీట్లను కొందరు అభిమానులు స్క్రీన్ షాట్లు తీసి పోస్టు చేస్తున్నారు. దీనిపై కేకేఆర్ సీఈవో మాట్లాడారు.
undefined
‘ఇప్పటికే బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇయాన్ మోర్గాన్ ఏం మాట్లాడారో మాకు తెలియరాలేదు. అయితే నిజాలన్నీ బయటికి వచ్చిన తర్వాత వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటాం. కేకేఆర్ ఎప్పుడూ ఇలాంటి వాటిని, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ప్రోత్సాహించదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ సీఈవో వెంకీ మైసూర్...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌‌కి బ్రేక్ పడే సమయానికి కేకేఆర్, ఏడు మ్యాచుల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్ మోర్గాన్‌కి గానీ, తనకి కానీ ఎలాంటి స్వేచ్ఛ ఉండడం లేదని బ్రెండన్ మెక్‌కల్లమ్ షాకింగ్ కామెంట్లు చేశాడు...
undefined
జట్టు మేనేజ్‌మెంట్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీని తొలగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత అతన్ని జట్టులో కూడా లేకుండా చేసింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కూడా ఇయాన్ మోర్గాన్‌, బ్రెండన్ మెక్‌కల్లమ్‌లపై ఇలాంటి చర్యలే తీసుకునే అవకాశం కనిపిస్తోంది...
undefined
click me!