టీమిండియా కెప్టెన్ అవుతానని అనుకున్నా, కానీ అప్పుడే ధోనీ వచ్చి... యువరాజ్ సింగ్ కామెంట్స్...

First Published Jun 10, 2021, 4:50 PM IST

టీమిండియాకి టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ దక్కడంలో యువరాజ్ సింగ్‌ది కీ రోల్. గౌతమ్ గంభీర్‌లాగే యువరాజ్ సింగ్‌కి కూడా ఈ రెండు విజయాల్లో రావాల్సినంత క్రెడిట్ దక్కలేదు. ధోనీ కంటే ముందే భారత జట్టులో చోటు దక్కించుకున్న యువరాజ్ సింగ్, టీమిండియా కెప్టెన్సీ వస్తుందని ఆశించాడట...

అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు ప్రకటించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా 2007లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు యువరాజ్ సింగ్.
undefined
2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఘోర పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ తీసుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు...
undefined
సీనియర్లు రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి ప్లేయర్లు టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
undefined
‘2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓటమి తర్వాత టీమ్‌లో ఓ రకమైన సందిగ్ధత నెలకొంది. ఇంగ్లాండ్‌కి రెండు నెలల టూర్ ఉంది. అలాగే సౌతాఫ్రికా, ఐర్లాండ్ టూర్లు కూడా ఉన్నాయి...
undefined
ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్... మొత్తంగా స్వదేశానికి దూరంగా నాలుగు నెలలు జట్టు గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో సీనియర్లు తమకి బ్రేక్ కావాలని నిర్ణయం తీసుకున్నారు.
undefined
2007 వన్డే వరల్డ్‌కప్‌తో జరిగిన సంఘటనల కారణంగా ఎవ్వరూ టీ20 వరల్డ్‌కప్‌ని సీరియస్‌గా తీసుకోలేదు... దాంతో నాకు టీ20 కెప్టెన్‌గా అవకాశం దక్కుతుందని ఆశించా....
undefined
ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా నియమిస్తూ ప్రకటన వచ్చింది. ఎవరు కెప్టెన్ అయినా అతనికి పూర్తిగా సపోర్ట్ చేయాలని అనుకున్నా.... అంతకుముందు రాహుల్ ద్రావిడ్, గంగూలీ కెప్టెన్సీలో అలాగే చేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.
undefined
టీ20 వరల్డ్‌కప్ నుంచి విశ్రాంతి తీసుకున్న జహీర్ ఖాన్, క్రిస్ గేల్ 50 బంతుల్లో సెంచరీ చేయడం చూసిన తర్వాత... ‘థ్యాంక్ గాడ్, నేను ఈ టోర్నమెంట్ నుంచి రెస్ట్ తీసుకున్నా...’ అని మెసేజ్ చేశాడు. టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అతనే మళ్లీ ‘ఓ నో... నేను రెస్టు తీసుకోకుండా ఉండాల్సింది’ అంటూ మెసేజ్ చేశాడంటూ చెప్పాడు యువరాజ్.
undefined
‘2007లో మేం యంగ్ టీమ్. మాకు ఇంటర్నేషనల్ కోచ్ కూడా లేదు. అప్పుడు లాల్‌చంద్ రాజ్‌పుత్‌ కోచ్‌గా ఉన్నా. వెంకటేశ్ ప్రసాద్ మా బౌలింగ్ కోచ్. జట్టు అంతా యువకులు, యంగ్ కెప్టెన్... టీ20 క్రికెట్ గురించి పెద్దగా ఏమీ తెలీదు.
undefined
టీ20 వరల్డ్‌కప్‌కి ముందు మేం ఒకటో రెండో టీ20లు ఆడామనుకుంటా అంతే... అదీకాక అదే ఫస్ట్ టోర్నీ. మేం ఎలాంటి ప్లాన్స్ లేకుండా సౌతాఫ్రికా వెళ్లాం. అయితే మేం అనుకున్నదానికంటే చాలా బాగా రాణించాం. విజయం కోసం మేం వేసిన ప్లాన్స్ చాలా వరకు వర్కవుట్ అయ్యాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు యువీ...
undefined
2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, టోర్నీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచాడు.
undefined
click me!