సచిన్ ప్యాంటు వేసుకుని బౌలింగ్ చేసిన జవగళ్ శ్రీనాథ్... ప్రేక్షకులు చూసి నవ్వేదాకా...

Published : Aug 31, 2022, 04:38 PM IST

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ పుట్టిన రోజు నేడు. వన్డేల్లో జవగళ్ శ్రీనాథ్‌కి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ని ఎక్కువ సార్లు అవుట్ చేసిన భారత బౌలర్ శ్రీనాథే. 154 సార్లు టాపార్డర్ బ్యాటర్ల వికెట్ తీసిన జవగళ్ శ్రీనాథ్, వన్డేల్లో 300+ వికెట్లు తీసి, మూడు సార్లు 5 వికెట్లు తీసిన ఏకైక భారత పేసర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

PREV
19
సచిన్ ప్యాంటు వేసుకుని బౌలింగ్ చేసిన జవగళ్ శ్రీనాథ్... ప్రేక్షకులు చూసి నవ్వేదాకా...

219 వన్డేల్లో 300 వికెట్లు తీసిన జవగళ్ శ్రీనాథ్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న అనిల్ కుంబ్లే, 300+ వన్డే వికెట్లు తీయడానికి 234 మ్యాచులు అవసరమయ్యాయి...

29

భారత జట్టు తరుపున 315 వన్డే వికెట్లు తీసిన జవగళ్ శ్రీనాథ్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వన్డే వరల్డ్ కప్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు శ్రీనాథ్...

39

 క్రికెట్ ప్రపంచంలో అలెన్ డొనాల్డ్, షాన్ పోలాక్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, అంబ్రోస్, వాల్ష్, గ్లెన్ మెక్‌గ్రాత్, జాసన్ గిలెస్పీ వంటి ఫాస్ట్ బౌలర్లు శాసిస్తున్న సమయంలో భారత జట్టు తరుపున ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్‌గా వారితో పోటీపడ్డాడు జవగళ్ శ్రీనాథ్..

49

శ్రీనాథ్ కాస్త మూడీ. ఏదైనా చిన్న విషయం జరిగినా మొఖం మార్చుకుని, దిగులుగా ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చునేవాడు జవగళ్ శ్రీనాథ్. ఓసారి శ్రీనాథ్ మూడ్‌ని మార్చేందుకు సచిన్ టెండూల్కర్ చేసిన పని, అందరిని నవ్వులు పూయించింది. ‘2002లో కటక్‌లో ఇంగ్లాండ్‌తో వన్డే మ్యాచ్ సమయంలో భారత ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్, ఎందుకో చాలా దిగులుగా కూర్చొని కనిపించాడు...

59

శ్రీనాథ్ దిగులుగా కూర్చోవడాన్ని గమనించిన సచిన్ టెండూల్కర్, అతన్ని ఒత్తిడి నుంచి బయట పడేయాలని అనుకున్నాడు. అయితే ఏం చెప్పినా ఆ మూడ్ నుంచి బయటికి రావడానికి సమయం పడుతుంది. అందుకే భారత మాజీ బ్యాటర్ హేమంగ్ బదానీతో కలిసి ఓ ప్లాన్ వేశాడు సచిన్ టెండూల్కర్...

69

శ్రీనాథ్ బ్యాగులో ఉన్న ప్యాంటును తీసి, అందులో తన ప్యాంటును పెట్టమని బదానీకి సూచించాడట సచిన్ టెండూల్కర్. బదానీ కూడా అలాగే చేశాడు. ఏదో ఆలోచిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చిన జవగళ్ శ్రీనాథ్, సచిన్ ప్యాంటును వేసుకుని మ్యాచ్ ఆడడానికి క్రీజులోకి వచ్చేశాడు...

79

జవగళ్ శ్రీనాథ్ పొడగరి. సచిన్ టెండూల్కర్ ప్యాంటు అతనికి చాలా చిన్నగా అయ్యింది. అది గమనించిన మిగిలిన టీమ్ మేట్స్, మనోడిని చూసి పకపకా నవ్వేశారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా శ్రీనాథ్ ప్యాంటును చూసి సరదాగా నవ్వుకున్నారు...

89

అయితే శ్రీనాథ్ మాత్రం ఇవన్నీ గమనించకుండా ఓ ఓవర్ బౌలింగ్ కూడా వేశాడు. ఏదో ఇబ్బందిగా అనిపించినా మనోడి మూడ్ కారణంగా దాన్ని పట్టించుకోలేదు. ఓవర్ పూర్తయిన తర్వాత ఓ టీమ్‌మేట్ చెబితే... అసలు విషయం గమనించి నవ్వుకున్నాడట శ్రీనాథ్...

99
javagal srinath-sachin tendulkar

అప్పుడు జరిగింది తెలుసుకుని, వెళ్లి ప్యాంటు మార్చుకుని వచ్చాడు. ఈ సంఘటనను తలుచుకుని పడి పడి నవ్వుకున్న జవగళ్ శ్రీనాథ్, సచిన్ టెండూల్కర్‌ని ఎప్పుడు చూసినా అతని పొట్టి ప్యాంటు సంఘటనే గుర్తుకువచ్చి నవ్వేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు...

click me!

Recommended Stories